- రెండూ తెలంగాణ ద్రోహులే
- మోదీకి కేసీఆర్, ఎంఐఎం పార్టీ ఇద్దరూ స్నేహితులే
- దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు
- తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబమే బాగుపడింది
- ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత
- కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం
- ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు
- ఆదిలాబాద్, బోధన్ విజయ భేరి ప్రచార సభల్లో రాహుల్ గాంధీ
ఆదిలాబాద్/బోధన్, ప్రజాతంత్ర, నవంబర్ 25: బిఆర్‌ఎస్, బిజెపిలు ఒక్కటేనని, అధికారం కోసం ఈ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ప్రజా తెలంగాణ రావాలనే తన ఆకాంక్ష అన్నారు. దొరల తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్ సమావేశంలోనే అమలు చేస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్, దిల్లీలో నరేంద్ర మోదీ ఒక్కటేనన్నారు. నరేంద్ర మోదీకి కేసీఆర్, ఎంఐఎం పార్టీ ఇద్దరూ స్నేహితులేనన్నారు. ప్రజా తెలంగాణ రావాలనేదే తన ఆకాంక్ష అని రాహుల్ గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను నాశనం చేశారన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణలో అవినీతి జరిగిందన్నారు. ప్రజా తెలంగాణలో మహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి మహిళ ఖాతాలో రూ. 2,500 జమచేసి వంట గ్యాస్ ను రూ, 500 లకే అందిస్తామన్నారు.
రూ. 4 వేలు వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందజేస్తామన్నారు. తెలంగాణలో ఇక బిఆర్‌ఎస్ అవినీతి పాలన అంతం కాబోతున్నదని, బిజెపి, బిఆర్‌ఎస్ రెండూ తెలంగాణ ద్రోహ పార్టీలని అన్నారు. అనంతరం బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. తన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారని, తనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటిని తొలగించారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని.. అక్కడ మోదీ.. ఇక్కడ కేసీఆర్ ఒకటే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కారు పంచర్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని తెలిపారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌తో ఎమ్మెల్యేకు భూములు అప్పగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.
కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మళ్ళీ అధకారంలోకి వేస్తే భూములు గుంజుకుంటారని విమర్శించారు. కేసీఆర్ చదువుకున్న పాఠశాల కాంగ్రెస్ పార్టీ కట్టిందే అని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీ సిటీ చేసింది కాంగ్రెస్ అని.. మెట్రో కాంగ్రెస్ హయంలోనే వొచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దోపిడీదారులన్నారు. లిక్కర్ మాఫియా, భూదందా కేసీఆర్ కుటుంబంలో ఉందని దుయ్యబట్టారు. దళితబంధు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ దారి మళ్లించారని ఆరోపించారు. వొచ్చేది ప్రజల ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మొదటి క్యాబినెట్ వి•టింగ్‌లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హావి• ఇచ్చారు. బీజేపీ ఏ బిల్లు పెట్టినా కేసీఆర్ మద్దుతు ఇచ్చారన్నారు. మూడు బిల్లులను తాను కళ్ళారా చూసినట్లు తెలిపారు. తెలంగాణ తన సొంత ఇల్లు అని పేర్కొన్నారు. కేసీఆర్ వి•ద ఒక్క కేసు పెట్టలేదని.. కేసీఆర్‌కు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్, బీజేపీని తరిమికొట్టాలని..కేంద్రంలో బీజేపీని, మోదీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ తెలంగాణలో, మోదీ దిల్లీలో రాజ్యమేలుతున్నారని అన్నారు. కారు టైరులు కాంగ్రెస్ పంచర్ చేసిందని..బీఆర్‌ఎస్ గాలి తీశారని..దిల్లీకి వెళ్లి మోదీని పంచరు చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల తెలంగాణ తెచ్చుకుందామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.




