ఫేషియల్‌ ‌రికగ్నేషన్‌ ‌టెక్నాలజీతో మేలు

దావోస్‌ ‌సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సరైన ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు చేయవచ్చు అని మంత్రి కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏఐ ఆన్‌ ‌ద స్ట్రీట్‌ : ‌మేనేజింగ్‌ ‌ట్రస్ట్ ఇన్‌ ‌ద పబ్లిక్‌ ‌స్క్వేర్‌’ అన్న అంశంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్‌ ‌తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్‌తో అనుసంధానమైన ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీ వాడకంపై ఉన్న సవాళ్ల అంశాన్ని మంత్రి కేటీఆర్‌ ‌తన మాటల్లో ప్రస్తావించారు. ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీ వాడకంపై ప్రజల విశ్వాసాన్ని జయించాల్సి ఉందని ఆయన అన్నారు. ఫేషియల్‌ ‌డేటా వినియోగం విషయంలో ప్రభుత్వం నిష్పక్షతపాతంగా వ్యవహరిస్తుందని అన్నారు. అవసరం అయితే తప్ప పౌరులపై నిఘా ఉండదన్నారు. పేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీ వినియోగంలో ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ప్రభుత్వ వ్యవస్థల మధ్య ఉన్న నియంత్రిత అధికారాలను గుర్తించాలన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఆ ప్రభుత్వ సంస్థలకు చాలా పారదర్శకంగా అధికారాలను అప్పగించాలన్న అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్‌ ‌వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *