అన్ని సమస్యలకూ అదే మూలమంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని విమర్శించారు. ప్రధాని మోదీకి ఉన్న విజన్ కొరతే ఈ అన్ని సమస్యలకు మూలమని ట్వీట్ చేశారు.
ఇటీవలి కాలంలో మోడీ పాలనపై కెటిఆర్ ప్రత్యక్ష యుద్దం ప్రారంభించారు. పలు అంశాలపైనేరుగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిండం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ వి•డియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్..ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా మోదీపై ఆయన చేసిన విమర్శలు ఇటు తెలంగాణ.. అటు కేంద్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.