‌ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర, జోగులాంబ గద్వాల, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో  గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన మాటమంతి కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకం అమలు చేస్తే నిజాందొర కేసీఆర్‌ ‌తెలంగాణలో అడ్డుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణలో కుటుంబ, అహంకార పాలన పోవాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రెండో రోజు జోగులాంబ గద్వాల జిల్లా ఇమామ్‌ ‌పూర్‌ ‌నుంచి ఆలంపూర్‌లోని ప్రొగటూరు వరకు యాత్ర కొనసాగింది. లింగన్‌ ‌వాయి, బూడిదపాడు, ఉండవెల్లి, తక్కశిల, ప్రొగటూరు వి•దుగా 13 కిలోవి•టర్ల మేర యాత్ర సాగింది.పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *