మలేరియా దినోత్సవ సందర్భంగా జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ఏప్రిల్ 25 (ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోనే ఇది సాధ్యమైనట్లు, వ్యాధి నిర్మూలనలో కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1కు చేరి అప్ గ్రేడ్ అయినట్లు ఆరోగ్య మంత్రి హరీష్‌రావు చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, డిఎంహెచ్‌వో మనోహర్‌తో కలిసి• జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో మలేరియా వ్యాధి నిర్మూలనలో ఎంతగానో పురోగతి, అభివృద్ధి చెంది జాతీయ అవార్డులను సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో ఇది సాధ్యమైనట్లు, మలేరియా వ్యాధుల నిర్మూలనలో స్టేజీ-2 స్థానం నుంచి స్టేజీ -1 స్థానానికి చేరి అప్ గ్రేడ్ అయ్యిందని ఆరోగ్య మంత్రి హరీష్ చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖపై సిఎం కేసీఆర్ దృష్టి సారించి అనేక కీలక నిర్ణయాలతో పురోగతి, అభివృద్ధి సాధన జరిగినట్లు మంత్రి వెల్లడించారు.
మలేరియా వ్యాధి నిర్మూలనకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. దోమలను నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.