పెట్రో ధరల పెంపుపై టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర వ్యాప్త ఆందోళన

  • పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మల దహనం
  • ఖీలీ గ్యాస్‌ ‌సిలిండర్లతో రోడ్లపై మహిళల నిరసన
  • బిజెపి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు
  • కేంద్రం తీరుపై ఘాటు విమర్శలు
  • తెలంగాణ ఉద్యమం తరవాత రోడ్డెక్కామన్న కవిత
  • హైదరాబాద్‌ ‌ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు
  • రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు…
  • నిజామాబాద్‌, ‌సూర్యాపేట, పాలమూరుల్లో భారీ ప్రదర్శనలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌వంట గ్యాస్‌ ‌ధరలను ఇబ్బడి, ముబ్బడిగా పెంచడంపై సామాన్య జనం భగ్గుమంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆందోళనలకు దిగారు. టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధరలు పెంచడంపై ఖాళీ గ్యాస్‌ ‌సిలండర్లతో రోడ్లపై నిరసనలకు దిగారు. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టి తమ ఆందోళనలు కొనసాగించారు. ట్రాక్టర్లకు తాళ్లు కట్టి లాగారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని నినదించారు. పెంచిన పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలని చేపట్టిన ధర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ ‌చేశారు. సికింద్రాబాద్‌ ‌చీఫ్‌ ‌రేషనింగ్‌ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ధర్నాలో మంత్రులు మహ్మూద్‌అలీ, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీకి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. ధర్నాలో కవిత మట్లాడుతూ…తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్‌ ‌దిల్లీ వెళ్లి కొట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్‌కు దక్కుతుందన్నారు. జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, ‌డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరలు పెంచుతున్నదని విమర్శించారు. తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మోడీ అధికారంలోకి వొచ్చినప్పుడు 2014లో పెట్రోల్‌ ‌ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్‌ ‌ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు.

ఈ రోజు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్‌ ‌ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్‌ ‌సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ ‌రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారని… ధాన్యం సేకరణపై మాత్రం మాట్లాడ్డం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదే మొదటిసారి మళ్ళీ మనం రోడ్లు ఎక్కడం అని తెలిపారు. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణ పై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్‌పై మండిపడ్డ ఆమె.. వాళ్లను, వీళ్లను జైలులో పెట్టిస్తా అంటాడు.. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్‌పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సూచించారు.

పేద ప్రజలకు మోడీ సర్కార్‌ ఏమి చేయలేదని విమర్శించిన కవిత.. పెద్ద పెద్ద వాళ్లకు రుణమాఫీ చేసింది మోడీ సర్కార్‌ అని.. అంబానీ, ఆదానీలకు, దేశం విడిచివెళ్లిన విజయ్‌ ‌మాల్యాకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా ఉద్యమ నిర్మాణం పటిష్టంగా చేస్తే ఈ కేంద్ర సర్కార్‌ ‌దిగివస్తుందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేద్దామని ఎమ్మెల్సీ కవిత సూచించారు. బిజెపి, మోడీ హఠావో అంటూ నినాదాలు ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న గ్యాస్‌, ‌పెట్రోల్‌ ‌ధరలకు నిరసనగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆధ్వర్యంలో రాంనగర్‌ ‌చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనిల్‌ ‌కూర్మాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఏడు సంవత్సరాల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల బతుకు ఆగమైందన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించే వరకు సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలన్నారు.

రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు…నిజామాబాద్‌, ‌సూర్యాపేట, పాలమూరుల్లో భారీ ప్రదర్శనలు
టిఆర్‌ఎస్‌ ‌పిలుపుతో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌వంట గ్యాస్‌ ‌ధరలనుపెంచడంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా నిజామాబాద్‌, ‌సూర్యాపేట, పాలమూరుల్లో ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు రోడ్డెక్కారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలు ఖాళీ గ్యాస్‌ ‌సిలండర్లతో రోడ్లపై నిరసనలు తెలిపారు. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టి తమ ఆందోళనలు కొనసాగించారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బీగగాల గణేష్‌ అన్నారు. నిజామబాద్‌ ‌టౌన్‌లో మోడీ డౌన్‌ ‌డౌన్‌ ‌నినాదాలు మార్మోగాయి. పెరిగిన గ్యాస్‌, ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలపై మహిళలు కేంద్రానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు నారీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది. ప్రధాని మోదీ డౌన్‌ ‌డౌన్‌ ..‌కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి..పెరిగిన గ్యాస్‌,‌డీజిల్‌ ‌ధరలు తగ్గించాలనే ఆడబిడ్డల నినాదాలతో సూర్యాపేట పట్టణం మార్మోగింది.

జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి క్యాంప్‌ ‌కార్యాలయం నుంచి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన..శంకర్‌ ‌విలాస్‌, ‌యంజి రోడ్‌, ‌తెలంగాణా తల్లి విగ్రహం వి•దుగా కొత్త బస్‌ ‌స్టాండ్‌కు చేరుకుంది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు ఖాళీ గ్యాస్‌ ‌సిలిండర్లతో నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన చార్జీలను తగ్గించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్‌ ‌జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌.. ‌పెరిగిన పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరలపై వెరైటీగా నిరసన తెలిపారు. రోడ్లపై సైకిల్‌ ‌తొక్కుతూ ఎమ్మెల్యే తన నిరసన వ్యక్తం చేశారు. సైకిల్‌పై వెళ్తున్న ఎమ్మెల్యేను పలువురు కార్యకర్తలు, అభిమానులు బైక్‌ ‌పై వొస్తూ ఫాలో అయ్యారు. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని ఎన్నారై టీఆర్‌ఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ ‌కూర్మాచలం డిమాంచ్‌ ‌చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మహబూబ్‌నగర్‌ ‌కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ ‌పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌, ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులను మోసం చేస్తుందన్నారు. పెంచిన గ్యాస్‌, ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల ను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌స్వర్ణ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌రాజేశ్వర్‌ ‌గౌడ్‌, ‌జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్‌ ‌యాదవ్‌, ‌రాష్ట్ర స్పోర్టస్ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌కేసీ నర్సింలు, డీసీసీబీ వైస్‌ ‌చైర్మన్‌ ‌వెంకటయ్య, జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page