పెట్రోల్, డీజిల్‌లకు కొరత లేదు

– అపోహలతో నిల్వ చేసుకోవద్దు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27వ తేదీన డిమాండ్‌ను మించి పెట్రోల్, డీజిల్‌లను 29,939 కిలోలీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883 కిలోలీటర్ల పెట్రోల్, 7,348 కిలోలీటర్లు డీజిల్‌కు డిమాండ్ ఉండేదని ఆయన తెలిపారు. కానీ 27న 11,490 కిలోలీటర్లు పెట్రోల్, 18,449 కిలోలీటర్లు డీజిల్‌ను వాహనదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. సరఫరాను క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రోజువారీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *