- ఎపికి తరలించిన సిఐడి పోలీసులు
- టెన్త్ లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్లు ఏపి పోటీసులు వెల్లడించారు. ఆయనను చిత్తూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్లు వారు తెలిపారు. గత 4 రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి హైదరాబాద్ వొచ్చిన సీఐడీ అధికారులు కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నారాయణను ఆయన సొంతకారులోనే ఏపీకి తరలించినట్లు సమాచారం.