కాంగ్రెస్ చేపట్టింది జన జాతర కాదు హామీల పాతర
తెలంగాణకు తీరని అన్నాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయం అంటే నమ్మేదెవరు
ఎక్స్ వేదికగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శ
కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి : భద్రాచలం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కాంగ్రెస్‌లో చేరికపై కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : రాహుల్ గాంధీ నాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేర గారడీ చేశారని, మళ్లీ నేడు లోక్ సభ ఎన్నికల సందర్భంగా 5 న్యాయాల పేర నయా నాటకానికి తెర తీశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా కెటిఆర్ స్పందిస్తూ…శనివారం తుక్కుగూడ లో కాంగ్రెస్ నిర్వహించింది జన జాతర సభ కాదని, అది హామీల పాతర…అబద్ధాల జాతర సభ అని విమర్శించారు. గెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడొచ్చి న్యాయం చేస్తానంటే నమ్మేదెవరని కెటిఆర్ శ్న్రించారు. నమ్మి అసెంబ్లీ ఎన్నికలలో వోటేసి గెలిపిస్తే నాలుగు నెలలుగా 4 కోట్ల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వొచ్చి రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమైందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారం లోకి వొచ్చాక నరకం చూపిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులు సాగునీరు లేక పంట నష్టపోతున్నారని, రుణ మాఫీ లేక అప్పుల పాలవుతున్నారని, తాగు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీకి రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని కెటిఆర్ ప్రశ్నించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా..200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా…చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా ్నదుకోరా అంటూ కెటిఆర్ శ్న్రల వర్శం కురిపించారు. చేతి గుర్తుకు వోటేస్తే చేతులెత్తేయడం ఖాయమని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. వంద రోజుల్లోనే హామీలను బొందబెట్టిన కాంగ్రెస్‌కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కెటిఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి : భద్రాచలం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కాంగ్రెస్‌లో చేరికపై కెటిఆర్
కాంగ్రెస్ పార్టీది ద్వంద్వనీతి అని కెటిఆర్ విమర్శించారు. బిఆర్‌ఎస్ భద్రాచలం ఎంఎల్‌ఏ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరడంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ…ఒక పార్టీలో గెలిచిన ఎంఎల్‌ఏలు, ఎంపీలు మరో పార్టీలోకి వెళితే వెంటనే అనర్హులు అయ్యేలా చట్ట సవరణ చేస్తామని లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ నేడు సిగ్గు లేకుండా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను చేర్చుకుంటున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వ్యవహారం గెలిచే వరకు ఒక మాట…గెలిచిన తర్వాత ఇంకో మాట అన్నట్లుగా ఉందని, ఆ పార్టీ రీతి…నీతి ఇదేనా అంటూ కెటిఆర్ దుయ్యబట్టారు.