ఎప్పుడే దినుసుకు
రెక్కలొస్తాయో తెలియదు.
నిన్న మొన్న
ఇరవై పలికిన టమాట
నేడు నూటనలభై.
పచ్చిమిర్చికీ కోపమే
ముప్ఫై పలికిన
ఆ కారం కూరగాయ
నూటఇరవైకి ఎగబాకింది.
వర్షాల్లేవన్నారు,
అందుకే సరుకు లేదన్నారు.
మరి ఎక్కువ ధర పెడితే
ఎలా దొరికేస్తోంది.
ఇది చీకటి వ్యాపారి మాయాజాలం.
పదవుల్లో ఉన్నోరితో కలిసి
ఆడుతున్న జూదం.
ఏ మందేస్తే ఏ రోగం తగ్గుతుందో
తెలిసిన రాజకీయ ఆర్థిక వైద్యుడు
కొన్నాళ్ళు పోయాక వేస్తాడు మందు.
అవసరాలు తీరుతాయి,
ధరలూ తగ్గుతాయి.
నడుమ నలిగేది సామాన్యుడే.
  – వేమూరి శ్రీనివాస్‌, 9912128967
                             ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *