ద్వైపాక్షిక సంధాలకు యుఎన్‌ ‌కాంగ్రెస్‌ ‌సమర్థన ప్రశంసనీయం

యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ

హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌యుఎస్‌ ‌హౌస్‌ ఆప్‌ ‌రిప్రెజెంటెటివ్స్ ‌స్పీకర్‌ ‌కెవిన్‌ ‌మేక్‌ ‌కార్థీ, సీనెట్‌లో సంఖ్యాబలమున్న నేత చార్ల్ ‌స్‌ ‌శూమర్‌, ‌సీనెట్‌లో రిపబ్లికన్‌ ‌పార్టీ నేత మిచ్‌ ‌మేక్‌ ‌కోనెల్‌, ‌సభలో డెమోక్రెటిక్‌ ‌పార్టీ నేత హకీమ్‌ ‌జెఫ్రీస్‌లు ఆహ్వానం మేరకు జూన్‌ 22‌న యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యుఎస్‌ఎ ఉపాధ్యక్షురాలు కమలా హేరిస్‌ ‌కూడా హాజరయ్యారు. కేపిటల్‌ ‌హిల్‌కు ప్రధాన మంత్రి చేరుకోవడం తోనే కాంగ్రెస్‌ ‌నాయకులు లాంఛనపూర్వకంగా స్వాగతం పలికారు. తరువాత, ప్రధాని మోదీ సభ స్పీకర్‌ ‌కెవిన్‌ ‌మేక్‌ ‌కార్థీ, కాంగ్రెస్‌లోని వివిధ నేతలతో కలసి విడి విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ప్రసంగంలో..భారతదేశం-యుఎస్‌ ‌మధ్య సంబంధాలను బలపరచడం కోసం యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌నుంచి దీర్ఘకాలంగా లభిస్తున్న బలమైన ద్విపక్షీయ సమర్థనను ప్రశంసించారు. భారతదేశం-యుఎస్‌ ‌ద్వైపాక్షిక సంబంధాలలో శరవేగంగా చోటుచేసుకొన్న ప్రగతిని గురించి ప్రధాన మంత్రి వివరించారు.

ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందింప చేసుకొనే విషయంలో తన దృష్టి కోణాన్ని ఆయన వెల్లడించారు. భారతదేశం యొక్క విస్తృతమైన ప్రగతిని మరియు ప్రపంచానికి భారతదేశం ఇవ్వజూపుతున్న అవకాశాలను గురించి కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ‌మేక్‌ ‌కార్థీ ప్రధాన మంత్రి గౌరవార్థం స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో కాంగ్రెస్‌ ‌యొక్క సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించడం ఇప్పటికి ఇది రెండో సారి. ఆయన ఇంతకు ముందు 2016 వ సంవత్సరం సెప్టెంబరులో యుఎస్‌ఎలో తన ఆధికారిక పర్యటన సందర్భంలో యుఎస్‌ ‌కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *