హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.