తెలంగాణకే గర్వకారణం చాకలి ఐలమ్మ

భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ.

తెలంగాణల దొరల మాటలకు, చేతలకు, తిరుగులేని సమయాన బాంచెన్‌ దొర నీ కాల్మొక్త…. అనే రోజుల్లో, దొర పేరు చెబితేనే ఆమడ దూరం పారిపోయే జనం ఉన్నటువంటి సందర్భాన.. దొర ఆగడాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన తొలివీరనారి- ఐలమ్మ. రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్‌’26న ఓరుగ ంటి మల్లమ్మ సాయిలు దంపతులకు జన్మించిన ఈమెకు11వ ఏటనే  పాలకుర్తి మండలానికి చెందిన చిట్యాల నర్సయ్య తో బాల్యవివాహం జరిగింది. నర్సయ్య కుటుంబం పెద్దది కావడం, ఆర్థికంగా వెనుకబడి ఉండడంతోదొర ఇంట ఊడిగం చేస్తూ,ఊరి జనాల బట్టలుతికేచాకలి వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కు కోలేకపోవడంతో, ఎదిగి వచ్చిన కొడుకులతో ఎవుసం చేయాలనుకొని పాలకుర్తి పక్కనే ఉన్న మల్లంపల్లి గ్రామంలోని జమీందార్‌ దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని నాలుగు ఎకరాలు సాగు చేసింది. పాలకుర్తిలో పటేల్‌ గా వ్యవహరిస్తూ,  ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ, వారిచే తన పంట పొలాల్లో వెట్టి చాకిరీ చేయించుకునే వీరమనేని శేషగిరిరావు అనే వ్యక్తికి కంటగింపుగా మారి విరోధం ఏర్పడిరది.ప్రజలు వెట్టికి గురై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితుల్లో పాలకుర్తిలో జీడి సోమనర్సయ్య నాయకత్వాన 1944లో ఆంధ్రమహాసభ ఏర్పడిరది.

ఒక రోజు ఐలమ్మ ను,ఆమె భర్త నర్సయ్య ను పశువులతో వచ్చి పని చేయాలని హుకుం జారీ  చేయడంతో, అప్పటికే ఆంధ్రమహాసభ పాలకుర్తి శాఖలో చేరిన ఐలమ్మ కుటుంబం మహాసభ ఇచ్చిన చైతన్య స్ఫూర్తితో.. పశువులతో పనిచేయడానికి నిరాకరించి, ఎవుసం చేయడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో,ఎలాగైనా ఐలమ్మ ను ఆర్థికంగా దెబ్బతీయాలనీ, అలా చేయడం వలన (ఆంధ్రమహాసభ )సంఘం తన పట్టుకోల్పోతుందని భావించిన దేశ్‌ ముఖ్‌ మల్లంపల్లి భూస్వామిని పిలుపించుకొని,ఐలమ్మ సాగు చేస్తున్న భూమిని తన పేరున రాయించుకొని, ఆ భూమి తనదని,ఆ భూమిలో పండిరచిన పంట తనకే దక్కుతుందని,కాబట్టి ఆ పంటను కోసుకొని రావాలంటూ 100 మంది అనుచరులను పంపించగా,ఈ భూమి నాది,పండిరచిన పంట నాదే నడుమ నీ దొర పెత్తనం ఏందిరా? అంటూ సింహంలా గర్జిస్తూ.. తాను బతికి ఉన్నంత కాలం ఆ భూమి,పంట ఇతరులకు దక్కదని ఎదిరించింది.సంఘపోల్ల సహకారంతో రోకలి బండను చేతబూని గుండాలను తరిమికొట్టి పంటను ఒడుపుగా తన ఇంటికి చేర్చుకున్న ధీశాలి ఐలమ్మ.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో కోర్టుకు వెళ్లగా..తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఒక ఆడది తన ఆధిపత్యాన్ని ధిక్కరించిందని ప్రతికారేచ్ఛతో రగిలి పోవడం. ఒకానొక సందర్భంలో..విసునూరు దొర తల్లిని దొరసాని అని పిలిస్తే,నన్ను దొరసాని అని కాదు ,దొర అని పిలువాలే అన్న జానమ్మ ను ప్రతిఘటించడంతో ఆగ్రహించిన పటేల్‌ శేషగిరి రావు ఐలమ్మ కుటుంబంపై కక్ష పెంచుకునిఈమే కుటుంబం ఆంధ్రమహాసభ లో చేరిందని,నాయకులకు అన్నం పెడుతున్నదని, తన అనుచరులతో దాడికి పాల్పడి ఐలమ్మ కూతురిపై అఘాయిత్యం చేయించి, ధనాన్ని, ధాన్యాన్ని దోచుకున్న దుర్మార్గుడు. ఐలమ్మ భర్త నర్సయ్య ప్రజా చైతన్యం కోసం సంఘనాయకులైన ఆరుట్ల రాంచంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహ రెడ్డి,నల్లా నర్సంహులు, దేవులపల్లి వెంకటేశ్వర్‌ రావు,నల్లా ప్రతాపరెడ్డిలను తన ఊరికి తీసుకురావడంతోఈ విషయం తెలుసుకున్న విస్నూర్‌ దేశ్‌ ముఖ్‌ రాంచంద్రారెడ్డి సంఘం నాయకుడు ఆరుట్ల రాంచంద్రారెడ్డి ని హతమార్చేందుకు కుట్ర పన్నిరౌడీలు, గుండాలతో దాడి చేయించాడు. తమ సంఘ నాయకులపై దాడులు చేస్తున్నారని తెలుసుకున్న ఐలమ్మ తనహ కుమారులైన సోమయ్య, లచ్చయ్యల సహకారంతో వారిని తరిమికొట్టింది.

ఆంధ్రమహాసభ నాయకుల సహకారంతో లక్షల ఎకరాల భూమి పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో ఆగ్రహించిన దేశ్‌ ముఖ్‌ వారందరిపై కేసులు పెట్టి జైలుకు పంపించగా ,దేశ్‌ ముఖ్‌ కుతంత్రాలను పసిగట్టిన వేలాది మంది ప్రజలు ఐలమ్మ కు అండగా నిలిచారు. నల్గొండ జైలులో ఉన్న తన వారిని చూసేందుకు ఒంటరిగానే 100 కి.మీ. నడిచివెళ్లేది. భీంరెడ్డి నర్సింహరెడ్డి, నల్ల నర్సింహులు, యాదగిరిరావులపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి కుట్రకేసు పెట్టి జైలుకు పంపించినందుకు ఆగ్రహించిన ప్రజానీకం విస్నూరు దేశ్‌ ముఖ్‌ రాంచంద్రారెడ్డి గడిని కూల్చిగడ్డిని మొలిపించారని కథనం. భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆమె రగిలించిన రైతాంగ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరుకు వేదికగా మారింది. భూమి లేకపోతే జిందగీ లేదని బందగీ దారిలో నడిచింది. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో కొంగు నడుముకు చుట్టి ముందుకు నడిచిన తొలి మహిళగా, వీర వనితగా ఐలమ్మ నిలిచింది. భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.

 

ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ.

1985 లో సెప్టెంబర్‌ 10న మరణించినా తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో.. భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహిళల చైతన్యంలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం బహుజన వర్గాలకు స్ఫూర్తి ప్రదాతగా,మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ జయంతి మరియు వర్థంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడం,ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యంశాలలో చేర్చడం హర్షదాయకం. తెలంగాణ సాయుధపోరాట చరిత్రను ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలుగులో రాసిన పుస్తకంలో ఐలమ్మ వీరోచిత పాత్రను ప్రముఖంగా పేర్కొనడం విశేషం.
అలాగే 2022 సం.లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని  దేశం కోసం వీరోచిత పోరాటం చేసి తమ జీవితాలను త్యాగం చేసి,ప్రాణాలు అర్పించిన 20 మంది వీర వనితల సచిత్ర కథలు దేశ ప్రజలందరికి తెలియజేయాలనే సంకల్పంతో..
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ,అమర చిత్ర కథ అనే సంస్థ తో కలిసి ‘ఇండియాస్‌ ఉమెన్‌ అన్సంగ్‌ హీరోస్‌’ పేరుతో  ప్రచురించిన  పుస్తకంలో ఐలమ్మ పోరాట చరిత్ర కూడ ఉండడం మన తెలంగాణకే గర్వకారణం.
image.png
నరేందర్‌ రాచమల్ల
  9989267462

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page