తెలంగాణకే గర్వకారణం చాకలి ఐలమ్మ
భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ. తెలంగాణల దొరల మాటలకు, చేతలకు, తిరుగులేని సమయాన బాంచెన్ దొర నీ కాల్మొక్త…. అనే రోజుల్లో, దొర పేరు చెబితేనే…