తరంగాలు

కళ్లు
భావాల రాగాలు
శ్రావ్యంగా వినిపించే
వాకిళ్లు….
చెట్టు
‘త్యాగం’ గోపురానికి
తొలి మెట్టు…
ప్రేమ
మనోపుష్పపు
సుగంధ మధురిమ…
స్నేహం
జీవితాల నదుల్ని
సంఘటితపరిచే
ప్రవాహం…
గతం
ఒకసారి పెనుభూతం
మరోసారి ఆనందగీతం…
కలం
వర్తమానం ‘ఆపరేషన్‌’ ‌ను
సమర్థవంతంగా
నిర్వహించే కరవాలం…
కీటికీజి
విభిన్న దృశ్యాల ఆచూకీ…
పల్లెజి
పైరు చీర తొడుక్కున్న
ప్రకృతికన్య సిగలోని
సిరిమల్లె…
డైరీ
అనుభవాలన్నీ
ఒకచోట చేరి
జరుపుకుంటున్న కచ్చేరి…
నాగలి
నిదురించే మట్టిని కదిలించి
శిల్పపుపొలంగా
మలిచే చైతన్యపు ఉలి…
–  డాక్టర్‌ ‌కొత్వాలు అమరేంద్ర   9177732414

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *