డబ్బు…
తన రాక అందరికీ ఆనందం
తన ప్రతి కదలికా ఓ అద్భుతం.
తానుంటే  ఆనందమే
లేకుంటే అంధకారమే.
మనిషికీ,మనిషికీ మధ్య
అడ్డుగోడలా నిలిచే ఇది ఉంటే
ఊరంతా తనవారే
లేకుంటే తనవారూ పరాయివారే.

మనిషిని నడిపిస్తూ,
మానవ బంధాలను
మనీ బంధాలుగా మారుస్తూ,
మనుగడసాగించే
దీని లీలలెన్నో…
పేరు ప్రతిష్ఠలను కొనిపెడుతుంది,
అందలేని అందలాలను అందిస్తుంది
స్వార్థానికి ఆలంబనై,
గర్వానికి హేతువై,
మనిషిని కీలుబొమ్మగా చేసి
ఆడించే ఇది
చెత్తబుట్టను చూడదు కానీ
తన మోజులో పడ్డ మనిషిని మాత్రం
మానవత్వం,మనిషితనం మరిచే
ఉచ్ఛ నీచాలు,నైతికతలను వదిలేసే
చెత్తవాడ్నిగా మార్చేస్తుంది

బతికున్నన్నాళ్ళూజి
డబ్బు ప్రభావంతో
నోటిమాట వేదవాక్కుగా
చెలామణీ అయినా వాడూ
అంతిమంగా
సొంతం చేసుకొనేది
ఆ …ఆరడుగుల నేలనే
అని మరువక  జన్మకు
సార్ధకత చేకూర్చుకో ఓ మనిషీ!
– వేమూరి శ్రీనివాస్‌
9912128967

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page