టెట్‌కు బిఇడి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే

ప్రభుత్వం నిర్ణయం
ఎప్రిల్‌ 11 ‌వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : టెట్‌ ‌దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఈయేడు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 12‌వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పేపర్‌ 1, ‌పేపర్‌ 2‌కు కలిసి దరఖాస్తు రుసుంను రూ. 300గా నిర్ణయిం చారు. ఒక పేపర్‌కు దరఖాస్తు చేసుకున్న ఇదే రుసుం వర్తించనుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ ‌చేసేటప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, స్టేట్‌, ‌మొబైల్‌ ‌నంబర్‌ ‌తప్పనిసరి. ఆన్‌లైన్‌ ‌పేమెంట్‌కు చివరి తేదీ ఏప్రిల్‌ 11. ‌పేమెంట్‌ అయిన తర్వాత జర్నల్‌ ‌నంబర్‌ ‌వొస్తుంది. ఈ నంబర్‌తో ఆన్‌లైన్‌ ‌దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక బీఈడీ, డీఈడీ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్‌ ‌రాసుకునేందుకు అవకాశం కల్పించారు. 2017 టెట్‌ ‌సిలబస్‌ ‌ప్రకారమే ఈ సారి పరీక్షలు నిర్వహించనున్నారు.

హెల్ప్ ‌డెస్క్ ‌సేవలు మార్చి 26 నుంచి జూన్‌ 12‌వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. జూన్‌ 12‌న టెట్‌ ‌నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. జూన్‌ 6 ‌నుంచి టెట్‌ ‌హాల్‌ ‌టికెట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *