•ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రమేష్ బాబు వెల్లడి•తిరుమల తిరుపతి మాదిరిగానే హైదరాబాద్ లో బ్రహ్మోత్సవాలు•భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు
జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2024 మార్చ్ 7 వ తేదీ నుండి 17వ తేదీ వరకు టీటీటీ నిర్వహిస్తుందని ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రమేష్ బాబు వెల్లడించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిటిడి స్థానిక సలహా మండలి ఉపాధ్యక్షులు రాజ శేఖర్ రెడ్డి, ఎంఎం.రాఘవేందర్, ఎల్ఏసి సభ్యులు ఏ.అనూప్ చక్రవర్తి, కె.బాజిరెడ్డి, కె.షణ్ముఖేశ్వర దాస్, ఎం.శివ గణేష్, ఎన్.వెంకట చలపతి, ఆర్.వెంకటేష్ గౌడ్, ఉమా కౌడి, పూర్ణ చందర్ రావు లాతోకలసి శ్రీ వెంకటేశ్వర స్వామి 4 వ వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎం.రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి మాదిరిగానే హైదరాబాద్ లో టిటిడి నిర్వహిస్తోందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, ఎంఎం.రాఘవేందర్ లు మాట్లాడుతూ మార్చ్ 7వ తేదీ నుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతాయని, మార్చ్ 8వ తేదీన ధ్వజారోహణం, పెద్ద శేష వాహనం, 9వ తేదీన చిన్నశేష వాహనం, హంస వాహనం, 10వ తేదీన సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 11వ తేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 12వ తేదీన మోహిని అవతారం, గురుడ వాహనం, 13వ తేదీన హనుమంత వాహనం, గజ వాహనం, 15వ తేదీన రథోత్సవం, 16వ తేదీన చక్ర స్నానం, 17 తేదీన పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో వెంకన్నస్వామి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.