- కోటిన్నర మందికి పరీక్షలు… 200 కోట్లు విడుదల
- ప్రజా సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్ నిర్ణయాలు
- అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా.. ప్రజల కోసం ఆలోచించి వారికి ఉపయోగపడేలా చేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో 30 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 25లక్షల మందికి పిస్క్రిషన్ గ్లాసెస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఒకటి రెండుసార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపడుతారని, ప్రజల కోణంలోనే ఆలోచిస్తారన్నారు. రెండో విడత కంటి వెలుగు పథకంపై వైద్యాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సవి•క్ష నిర్వహించారు. జనవరి 18న రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి రూ.200 కోట్ల మంజూరికి జీవో ఇచ్చామని తెలిపారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని 8 నెలల పాటు నిర్వహించామన్నారు. ఇప్పుడు రెండో విడత 5 నెలల పాటు చేస్తామన్నారు.
మొత్తం 100 పని రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని హరీష్ రావు అన్నారు. మొదటి విడతలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 827 బృందాలు పనిచేశాయని హరీష్ రావు తెలిపారు. ఈ ఏడాది రెండో విడత కోసం 1500 టీమ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వైద్యరంగంలో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. వైద్యులు, ఎక్విప్మెంట్లను కూడా పెంచుతున్నామని అన్నారు. 969 పోస్టుల మెరిట్ లిస్ట్ మరో రెండు రోజుల్లో రిలీజవుతుందని చెప్పారు. రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ కార్యక్రమాలతో పాటు కంటి వెలుగు చేస్తామని హరీష్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతారని ఆయన చెప్పారు. ఇక జనవరి 5న కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి రీశ్‌రావు పిలుపునిచ్చారు.
వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా కార్యక్రమంపై డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, క్వాలిటీ టీమ్స్, పోగ్రామ్ ఆఫీసర్లకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఇంతకు ముందు 1.54కోట్ల మంత్రికి పరీక్షలు చేసి, 50 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అధికారులంతా పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందన్నారు. గతేడాది ఎనిమిది నెల్లలో కార్యక్రమం నిర్వహించగా.. ఈ సారి వంద పని దినాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలిసారి 827 బృందాలు పని చేస్తే..ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు చెప్పారు. బృందాలకు అవసరమైన ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని, రెగ్యులర్ సర్వీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓలు బాగా పని చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. జనవరి 5న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. ఎక్కడా ఇబ్బందులు రావొద్దని, సమస్య వస్తే రీప్లేస్ చేయాలని, బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలన్నారు.
మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఆయా బృందాలకు రోజువారీ ప్లానింగ్ ఇవ్వాలని, పరీక్షలు చేయించుకోవడం మిస్సయిన వారి కోసం మళ్లీ ఏర్పాటు చేయాలన్నారు. జనవరి ఒకటి వరకు ఆటో రిఫ్రాక్తో మిషన్లు వొస్తాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందే రీడింగ్ గ్లాసెస్ అందుబాటులోకి వొస్తాయన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో పిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు సైతం శిక్షణ ఇచ్చి.. సేవలను వినియోగించుకుంటామన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ బృందం, జిల్లాకో క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని నియమించి.. కార్యక్రమం ప్రభావవంతంగా జరుగుతుందా? లేదా? పరిశీలించనున్నట్లు చెప్పారు. ఎల్ వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి దవాఖానా సహకారంతో సిబ్బందికి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటి ఉంటుందన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుందన్నారు.
కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దాన్ని అమలు చేయడంలో మనందరిది ముఖ్య పాత్ర అని, లక్ష్యం నెరవేరేలా అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కంటి వెలుగు బాగా పని చేసే వారికి ప్రశంసలు ఉంటాయని, శాఖ పరమైన గుర్తింపు ఉంటుందన్న ఆయన.. విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గొప్ప కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డస్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.