ప్రతి భారతీయుడూ గర్వించే ఉద్విగ్న క్షణమిది
చంద్రయాన్ సక్సెస్‌పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
పార్టీ కార్యాలయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై ‘విక్రమ్’ ల్యాండింగ్ దృశ్యాలను
ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులు
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా చిందన్నారు.బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ఘట్టాలను.. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో.. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి వీక్షించారు.
అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఈ సందర్భంగా ఇస్రో, చంద్రయాన్ టీమ్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇస్రో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగిరేస్తోంది’ అని అన్నారు. ‘చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కి, 140 కోట్ల మంది భారతీయులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
కేవలం నరేంద్రమోదీ వంటి నాయకుడికి మాత్రమే ఇలాంటి చాలెంజెస్ ను స్వీకరించడం, వాటిని విజయవంతంగా పూర్తిచేసేందుకు కావాల్సిన సంకల్పబలాన్ని శాస్త్రవేత్తలకు అందించగలిగే సామర్థ్యం ఉంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు విఫలయత్నం చేయడం.. వివిధ దేశాలు కూడా ఈ దిశగా ప్రయత్నించి విఫలమయిన సందర్భాల్లో భారత్ సాధించిన ఈ విజయం.. యావత్ ప్రపంచానికి చంద్రునిపై చేయబోయే ప్రయోగాల్లో ఓ దిక్సూచిగా ఉంటాయని ఆయన అన్నారు. చంద్రయాన్ విజయం అంతర్జాతీయ ప్రయోగాల చరిత్రలో ఓ ప్రధానమైన మలుపు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.