సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో గ్రామసభలను నిర్వహించడాన్ని దళిత బహుజన ఫ్రంట్ ఆహ్వానిస్తుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. గత పదిహేళ్లుగా అధికారులు గ్రామ గ్రామాలకు ప్రజలకు దూరంగా ఉన్నారని పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం గ్యారెంటీ ల అమలుకు శ్రీకారం చుట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామసభ సభలకు ముందు రోజే అధికారులు దరఖాస్తు ఫారాలను ప్రజలకు ఇస్తున్నారని మీ సేవలో చుట్టూ ప్రజలు తిరగకుండా తమ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇతర ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జత చేసి సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తుకు రసీదు తప్పకుండా తీసుకోవాలన్నారు గ్రామసభలను హడావిడిగా కాకుండా ప్రణాళికబద్ధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్వహించి గ్రామ సభలను విజయవంతం చేయాలని కోరారు. రేషన్ కార్డు లేని వారు తెల్ల పేపర్ మీద జనరల్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామసభల సమాచారాన్ని అధికారులు టామ్ టామ్ ద్వారా ప్రచారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ నిజాంపేట మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కొమ్మాట బాబు, తదితరులు. పాల్గొన్నారు
గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి
