ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు ..:సీఎం కేసీఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెం
మహమ్మద్ ప్రవక్త బోధనలైన శాంతి, కరుణ, ధార్మిక చింతన, దాతృత్వం, ఐకమత్యం, సర్వ మానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ముస్లిం మైనారిటీ ప్రజల సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని సిఎం తెలిపారు. తెలంగాణలో గంగా జమున తహజీబ్’ పరిరక్షణకు తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.