కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్నిఅందుకున్న కె.సజయ   

 

కేరళలోని త్రిసూర్ లో శుక్రవారం ,సెప్టెంబర్ 30, సాయంత్రం కేంద్ర సాహిత్య అకాడమీ వారి “2021వ సంవత్సరపు అనువాద పురస్కారాల”ను ప్రదానం చేశారు. కేరళ సంగీత, నాటక అకాడమీలోని ఎం.టి.మహ్మద్ స్మారక ధియేటర్ లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ అనువాదం చేసిన ‘అశుధ్ద భారత్’ పుస్తకానికి ఈ సంవత్సరం జూన్ నెలలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది.  ప్రసిద్ధ కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలో వివిధ భారతీయ భాషల్లో అనువాద పురస్కారాలను అందుకున్న ప్రముఖులతోపాటు సజయ కూడా ట్రాన్స్ లేషన్ ప్రైజ్ అందుకున్నారు.. ఈ సందర్భంగా సజయ గురించి, తను అనువాదం చేసిన “అశుద్ధ భారత్” గ్రంథ విశేషాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార్ చేతుల మీదుగా సజయ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.. సభాస్థలి వద్ద పురస్కార గ్రహీతల చిత్రాలతో కూడిన భారీ కటౌట్ నెలకొల్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page