ఐటి కంపెనీల్లో డ్రగ్స్ ‌ప్రకంపనలు

  • 13 మంది ఉద్యోగులపై కంపెనీల వేటు
  • మరో 50 మందికి నోటీసులు
  • పోలీసుల జాబితాలో పేర్లు ఉండడంతో చర్యలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ ‌కేసులో..వాటిని తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ ‌పెడ్లర్ల వద్ద సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్ల చిట్టా లభ్యమైంది. సాప్ట్‌వేర్‌ ‌ప్రొఫెషనల్స్‌కు పెడ్లర్లు డ్రగ్స్, ‌గంజాయి అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. అమెజాన్‌, ఇన్ఫోసిస్‌, ‌మైక్రోసాప్ట్, ‌మహేంద్ర, క్యూసాప్ట్ ‌కంపెనీలకు చెందిన ఉద్యోగులను పోలీసులు పట్టుకున్నారు. ప్రేమ్‌కుమార్‌, ‌టోనీ, లక్ష్మీపతిల నుంచి డ్రగ్స్, ‌గంజాయిని కొనుగోలు చేశారు. సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్ల పార్టీలపై పోలీసులు నిఘా పెట్టారు.

ఇలా జాబితాలో పేర్లు ఉండడంతో  డ్రగ్స్ ‌తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. డ్రగ్‌ ‌తీసుకున్నట్లు తేలిన 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి.  సాప్ట్‌వేర్లకు డ్రగ్స్ అమ్మినట్టు తేలడంతో పోలీసులు కంపెనీలకు లేఖలు రాశాయి. వీకెండ్‌లో సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్లు డ్రగ్స్ ‌పార్టీలకు వెళుతున్నారని..పోలీసులు పక్కా నిఘాతో వీరిని పట్టుకున్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌ ‌డ్రగ్‌ ‌కేసులు, పబ్‌ ‌లింక్‌ల్లో దారులన్నీ వైజాగ్‌ ‌వైపే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అరకు లోయలో హైదరాబాద్‌ ‌నార్కోటిక్‌ ‌వింగ్‌  ‌సోదాలు చేపట్టింది. నిన్న సురేష్‌, ‌నరేష్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ ‌చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో బీటెక్‌ ‌కుర్రాడి చావుకు కారణమైన లక్ష్మిపతి గ్యాంగ్‌తోనూ వీరికి లింక్‌లున్నాయి.

నరేష్‌కు తెలుగు రాష్ట్రాల్లో అనేక లింక్‌లు ఉన్నాయి. అరకు నుంచి హైదరాబాద్‌కు హాష్‌ ఆయిల్‌ ‌సప్లై అవుతుంది. గంజాయి నుంచి తయారౌవుతున్న హాష్‌ ఆయిల్‌కు యూత్‌లో భారీ డిమాండ్‌ ఉం‌ది. హాష్‌ ఆయిల్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌చాలా సులభంగా చేయచ్చన్నది ఆ వ్యాపారంలో ఆరితేరిన వారి అనుభవం చెప్తుంది. హాష్‌ ఆయిల్‌ ‌కోసం రెండు రాష్ట్రాల్లో వేలల్లో కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేజీ హాష్‌ ఆయిల్‌ 5 ‌లక్షలు రూపాయలు. సిగరెట్‌లకు హాష్‌ ఆయిల్‌ ‌రాసుకుని మత్తులోకి జారుతుంది యువత. డ్రగ్స్ ‌చైన్‌ ‌గుట్టు మొత్తం రట్టు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు పుడింగ్‌ ‌పబ్‌ ‌కేసులో పరారీలో ఉన్న కిరణ్‌ ‌రాజ్‌, అర్జున్‌పై లుకౌట్‌ ‌నోటీసులు జారీ చేశారు.

నిందితులు విదేశాలకు పారిపోకుండా బంజారాహిల్స్ ‌లుకౌట్‌ ‌నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అనిల్‌, అభిషేక్‌ను అరెస్ట్ ‌చేశారు. పుడింగ్‌ ‌పబ్‌ ‌నుంచి ఇద్దరు పోలీస్‌ అధికారులకు వాటాలు వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. పబ్‌లో రోజూ డ్రగ్స్ ‌సరఫరా అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అభిషేక్‌, అనిల్‌ ‌వాట్సాప్‌ ‌గ్రూప్‌ ఏర్పాటు చేసి కస్టమర్లకు సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page