ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఒక బూటకం!

“సోమవారం స్టాక్‌ మార్కెట్‌, విజ్ఞంభించింది. సట్టా బజార్ కూడా అంతే…. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని స్టాక్‌ మార్కెట్‌ కళ కళ లాడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారి ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించి అంచనాలను విడుదల చేస్తున్నాయి..”

ఎన్నికల ఫలితాల అంచనాలు, జ్యోతిష్యాలు ఏవైనా సరే… వీటి తాకిడికి మార్కెట్‌, ప్రజా జీవితం అతలాకుతలమవుతోంది. ఎవరికి ఇష్టం వొచ్చినట్లు వారు సర్వే పేరుతో ఎన్నికల ఫలితాలపై అంచనాలు చెబుతున్నారు. వీటిని ముద్దుగా ఎగ్జిట్‌ పోల్స్‌ అంటున్నారు. నేతి బీరకాయలో నేయి ఉన్నంత చందంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఉంటున్నాయి.  మొన్నటికి మొన్న రాజస్తాన్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ రాదన్నారు. కాంగ్రెస్  వచ్చేస్తుందని చెప్పారు. కానీ బీజేపీ అధికారంలోకి వొచ్చింది. తమను తాము గందరగోళ పరుచుకుంటూ, ప్రజలను తికమకకు గురి చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ విశ్వసనీయత చాలా సార్లు ఇటీవల కాలం దెబ్బతింది. ప్రజల ఆలోచనా విధానాలు, పోలింగ్‌ సరళి, వోట్లు వేసిన తీరుపై తమకు తోచిన భాష్యాన్ని చెబుతున్నారు. వీరి రీసెర్చి మెథడాలజీ లోపభూయిష్టంగా ఉంటోంది. గాంబ్లింగ్‌గా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తయారయ్యాయి. బీజేపీకి కేంద్రంలో మూడోసారి అధికారం రావొచ్చు. ఆ సంగతి పక్కనపెడితే మిగతా అంశాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్న అంశాల్లో వాస్తవికత లోపించింది.
ఎగ్జిట్‌ ఫోల్ఫ్స్‌ వెనక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు ఉంటున్నాయనే వాదనలు బలంగా ఉన్నాయి. దీని వల్ల ఎగ్జిట్‌ పోల్స్‌ దారితప్పుతున్నాయి. ఉదాహరణకు 1వ తేదీన విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ చూడండి. పాపులర్‌ సర్వే సంస్థలు బీజేపీకి భారీ మెజార్టీ వొస్తుందని చెప్పాయి. సింపుల్‌ మెజార్టీ వొస్తుందని చెప్పలేకపోయాయి. అదే వీటి బలహీనత. చాలా సంస్థలు 350కు పైగా సీట్లు బీజేపీకి వొస్తాయంటున్నాయి. అందుకు విరుద్దంగా దేశంలో రాజకీయ సామాజిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీజేపీ కూటమి ఇండియా కూటమి లోని పార్టీలను తుత్తునియలు చేసి భారీ మెజార్టీతో మూడోసారి అధికారాన్ని కైవశం చేసుకుంటుందని సర్వే సంస్థలు సూచిస్తున్నాయి.
బీజేపీ ప్రచారంలో తీవ్ర నిరాశా   నిస్పృహలకు గురైంది. వోటర్లు ప్రస్తావించే అంశాలను జాగ్రత్తగా డైవర్ట్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. దీనికి తగ్గట్టుగా బ్యూరోక్రసీ, ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ తానా అంటే తందానా అనే విధంగా వ్యవహరించాయి. బీజేపీ ప్రయోజనాలే తమకర్తవ్యం అనే రీతిలో ఈ వ్యవస్థలు నడుచుకున్నాయి. ఈ వ్యవస్థలు పోటీలుపడి బీజేపీకి మూడోసారి మెజార్టీ వొచ్చేందుకు దోహదపడ్డాయా అనే అనుమానం వొచ్చే విధంగా వ్యవహరించాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్దిని చెప్పుకుంటాయి. కాని బీజేపీ ఏమి చేసింది. ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని జనంలో ప్రచారం చేసింది.. . మత ప్రస్తావనను తెచ్చింది.  హిందూ వోటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ దేశంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను బీజేపీ ప్రచారంలో ప్రస్తావించలేదు. ఎంతసేపు మతం ముసుగులో ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, వోట్లు దండుకోవడం ఒక్కటే బీజేపీకి తెలిసిన విద్య.
ఈ సారి ప్రచారం చేసేందుకు జాతీయ అంశాలు లేవు. పుల్వామా ఘటనలను బీజేపీ మర్చిపోయింది. సిద్దాంతపరమైన దాడిని తీవ్రం చేసింది. బీజేపీ డొల్లతనాన్ని విపక్షాలు బహిర్గతం చేసేనరికి, విపక్షాలకు లేని పోని వివాదాలలను బీజేపీ అంటగట్టింది. సమాజాన్ని మతం వారీగా బీజేపీ చీల్చింది. కాని మెజార్టీ మతం వారికి విపక్షాలు ప్రస్తావిస్తున్న సమస్యలు తెలుసు. బీజేపీ వాటికి బదులివ్వకుండా తప్పించుకుంటున్నదనే విషయాన్ని (గ్రహించారు. గతంతో పోల్చితే ఈ రోజు అనేక అర్బన్‌, సెమి అర్బన్‌ ప్రాంతాల్లో బీజేపీ బలం ఉన్న ప్రాంతాల్లో, బీజేపీ ఎదురీదుతోంది. కర్నాటక మహారాష్ట్ర  రాజస్తాన్‌, బిహార్‌లో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంది. అయినా మన సర్వే సంస్థలకు ఈ వాస్తవలు కనపడలేదు. బీజేపీ ఈ రాష్ట్రాల్లో స్వీప్‌ చేస్తుందని, అందుకు తగ్జట్టుగా సర్వే ఫలితాలను బీజేపీకి అనుకూలంగా విడుదల చేశారు. బీజేపీకి 400కుపైగా సీట్లు వొస్తాయన్న ఆశలకు ఈ రాష్ట్రాలు గండి కొట్టాయి. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి బంపర్‌ మెజార్టీ వొస్తున్నట్లు గణాంకాలను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఇంత కంటే హీనమైన అంశం మరొకటి ఉంటుందా?
ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 2014-2019 తరహాలో సీట్లు రావని, ఆ టీంకు చెందిన వాళ్లు ఎన్నికల్లో మట్టి కరుస్తారని, అదే టీం లీడర్‌ ఎంత వరకు మళ్లీ అధికారంలోకి వొస్తాడో అనుమానమనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వొచ్చినా, టీం లీడర్‌ వేరే నాయకుడు ఉంటారనే ప్రచారం ఊపందుకుంది. ఈ అంశాలను మన సర్వే సంస్థలు దాచిపెడుతున్నాయి. కనీసం ప్రస్తావన కూడా చేయడం లేదు. బిహార్‌, యూప్పీ, కర్నాటక, రాజస్తాన్‌లో చోటు చేసుకున్న పరిణామాలు వేరు. మన సర్వే సంస్థలు టీవీల్లో చేస్తున్న ప్రచారం తీరు వేరు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో అదనంగా సీట్లు తెచ్చుకున్న పైన పేర్కొన్న రాష్ట్రాల్లో 70 సీట్లను బీజేపీ కోల్పోతుందంటున్నారు. ఈ వాస్తవాన్ని మన సర్వే సంస్థలు గమనించినా, తమ ఎగ్జిట్‌ పోల్ఫ్‌లో చెప్పడం లేదు. ఇక దక్షిణాదిన బీజేపీ వోట్ల శాతం పెరుగుతుందని, సీట్లు బాగా పెరుగుతాయనే వాదనను తెరపైకి తెచ్చాయి. కాని వీటిని ఎంత వరకు నమ్మాలి.
రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణం అందుకు భిన్నంగా ఉంటోంది. బీజేపీ నునామీ నృష్టించ బోతుందనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే, మమతా బెనర్జీ, జగన్‌, కేసీఆర్‌: నవీన్‌ పట్నాయక్  ఇక రానున్న కాలంలో సంక్లిష్ట  పరిస్థితులను ఎదుర్కొనక తప్పదనిపిస్తుంది.  సోమవారం స్టాక్‌ మార్కెట్‌, విజ్ఞంభించింది. సట్టా మార్కెట్‌ కూడా అంతే…ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ బాగుంది. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని స్టాక్‌ మార్కెట్‌ కళ కళ లాడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారి ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించి అంచనాలను విడుదల చేస్తున్నాయి.
–  శ్యామ్ సుందర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page