ఇక అభివృద్ధి మొదలైది

 తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం 
 షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్
 రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనామహిళలకు  బస్సుల్లో  ఉచితంగా ప్రయాణం
షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంతో ఇక అభివృద్ధి పట్టాలు ఎక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమ రాజ్యాంగ మారబోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చనీ, ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం అని శంకర్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారనీ ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం తాము ప్రారంభించినట్టు చెప్పారు. వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్‌ను సిఎం అందించారని  తెలంగాణ ప్రజలకు పండగరోజన్నారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. తనది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని శంకర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్నారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని సిఎం భరోసా ఇచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page