అపర భగీరథుడు సీఎం కేసీఆర్ 

అమీన్ పూర్ నీటి కష్టాలకు ఇక చెల్లు
ఒకే రోజు 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రెండు భారీ రిజర్వాయర్ల ప్రారంభం..
చక్రపురి కాలనీలో ఐదు కోట్లతో నూతన 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన..
అమీన్ పూర్ మున్సిపల్ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో 5 నూతన రిజర్వాయర్లు.. 165 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం.
నాడు మంచినీటి కోసం కిలోమీటర్ల నడక..
నేడు పొయ్యి కాడికే మంచినీళ్ల జల జల
అమీన్ పూర్ ఇంటింటికి స్వచ్ఛ జలాలు..
ప్రతి వ్యక్తికి ప్రతి రోజు 150 లీటర్ల నీళ్లు..
65 ఏళ్లలో సాధ్యం కానీ పనులను 10 ఏళ్లలో చేసి చూపించాం..
హామీలు గుప్పించడం కాదు చేతుల్లో చేసి చూపించే వాడే నిజమైన నాయకుడు.. అది సీఎం కెసిఆర్ కే సాధ్యం..
వాణి నగర్ కాలనీలో 80 లక్షల రూపాయలతో యుజిడి, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
బంధం కొమ్ము నుండి అమీన్ పూర్ రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో విద్యుత్ పనుల ప్రారంభం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 24 కాలనీలలో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పది మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 5 భారీ రిజర్వాయర్లు నిర్మించడం జరిగిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, బీరంగూడ గుట్టపైన 22 కోట్ల రూపాయల అంచనామయంతో నిర్మించిన మూడు రిజర్వాయర్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.అనంతరం చక్రపురి కాలనీలో ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, బంధం కొమ్ము నుండి అమీన్పూర్ వరకు రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చెప్పడుతున్న విద్యుత్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.వాణి నగర్ కాలనీలో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యుజిడి మరియు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..మనిషి బ్రతికేందుకు అత్యంత అవసరమైన రక్షిత మంచినీటిని అందించేందుకు మిషన్ భగీరథ అనే మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడు అయ్యాడని అన్నారు.గత ప్రభుత్వాల హయాంలో అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో  బిందెడు మంచినీటి కోసం వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసే పరిస్థితులు ఉండేవని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం అమీన్ పూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా మున్సిపల్ వ్యాప్తంగా ఐదు భారీ రిజర్వాయర్లు నిర్మించి, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా బిందెడు నీటి కోసం చెలిమల్లో, వాగుల్లో, వంకల్లో దొరుకుతాయన్న ఆశతో  కిలోమీటర్ల దూరం నడిచే దుర్భర పరిస్థితిలు ఉండేవని అన్నారు. మంచినీరు లభించని గ్రామాలకు ఆడపిల్లను సైతం ఇచ్చే పరిస్థితులు ఉండేవి కాదన్నారు. అలాంటి పరిస్థితుల నుండి ప్రతి ఇంటికి ప్రతిరోజు రక్షిత మంచినీరు అందిస్తూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరధుడిగా పేరు పొందారని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 43,791 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఒక లక్ష 30 వేల కిలోమీటర్ల పైపులైన్ సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ మహత్తర పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా హెచ్ఎం డబ్ల్యు ఎస్, గ్రామీణ నీటిపారుదల శాఖ విభాగాల ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీలు, కళాశాలలకు సైతం రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మంచినీటి పైపులైన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న కాలనీలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని లక్ష్యంతో చక్రపురి కాలనీలో ఐదు కోట్ల రూపాయలతో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే సుమారు 20 కాలనీలకు పైగా ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.అమీన్ పూర్ చెరువు కట్ట నుండి బంధం కొమ్ము మీదుగా చందానగర్ వరకు రహదారిని ప్రభుత్వం విస్తరిస్తోందని, ఇందుకు అనుగుణంగా విద్యుత్ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల హెచ్ఎండిఏ నుండి నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎందుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.రాబోయే నవంబర్ చివరి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి మరింత ముందుకు కొనసాగాలంటే టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం బీరంగూడ గోశాల ఎదుట.. విద్యా భారతి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన సరస్వతీ విద్యాపీఠం పాఠశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కల్పన ఉపేందర్ రెడ్డి, మహాదేవ్ రెడ్డి, బిజిలి రాజు, మల్లేష్, మాధవి, బీరంగూడ శ్రీ మల్లికార్జున దేవాదాయ శాఖ చైర్మన్ ఏనుగు తులసి రెడ్డి, కోఆప్షన్ సభ్యులు, విద్యుత్ శాఖ డిఈ రమేష్ చంద్ర, హెచ్ఎండబ్లుఎస్ సి జి ఎం శ్రీధర్, జిఎం నారాయణ, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, వడ్ల కాలప్ప,  కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page