హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో తనిఖీలు
ఫోన్‌ తదితర వస్తువుల స్వాధీనం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్‌ నగర్‌ లోని వరవరరావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్‌.వేణుగోపాల్‌ పాటు ఎల్బీనగర్‌ లోని రవిశర్మ, అనురాధ దంపతుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వేణు ఇంట్లో దాదాపు 5 గంటల పాటు తనిఖీలు చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశర్మ సెల్‌ ఫోన్‌, పాత పుస్తకాలు, పాత కరపత్రాలు సీజ్‌ చేశారు. ఈ నెల 10న విచారణకు రావాలని ఆదేశించారు. కాగా, ఇటీవల మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు దీపక్‌ను కూకట్‌పలల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద దొరికిన సమాచారం ఆధారంగా వేణు నివాసంలో సోదాలు చేసినట్లు సమాచారం. గతంలోనూ వీరి ఇళ్లల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

మరోవైపు, గురువారం ఉదయం 5 గంటలకు ఎన్‌ఐఏ అధికారులు తమ ఇంటికి వచ్చారని జర్నలిస్ట్‌ వేణు తెలిపారు. సెర్చ్‌ వారెంట్‌తో వచ్చామని వారు చెప్పినట్లు వివరించారు. 2013లో నయీమ్‌ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశానని.. ఆ పుస్తకాలను తీసుకెళ్లారని చెప్పారు. తన మొబైల్‌ సీజ్‌ చేశారని అన్నారు. ఎన్‌ఐఏ గతంలో అరెస్ట్‌ చేసిన మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు దీప్‌ కు, తనకు సంబంధం ఉందని కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసుపై గత ప్రభుత్వంలోని సీఎంకు లేఖ రాశానని పేర్కొన్నారు. తాను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యిందని వెల్లడిరచారు. దేశంలో ఎన్‌ఐఏ ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, జనవరి 3న తనపై పెట్టిన కేసును ఎన్‌ఐఏ టేకప్‌ చేసుకుందని వివరించారు. ఈ కేసులో తన పేరును ఏ ` 22గా చేర్చారని.. తాను ఓ మాస పత్రికను నడుపుతున్నానని చెప్పారు. తాను ’విరసం’లో ప్రస్తుతం లేనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *