హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

ట్రాఫిక్ లో గంటలకొద్దీ ఇరుక్కుపోయిన వాహనదారులు 

హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26; హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో జోరు వాన పడింది.పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, బంజారాహిల్స్, షేక్పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, కిస్మత్‌పూర్‌, అత్తాపూర్‌ జాగీర్‌, మణికొండ, ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

నార్సింగి, కాటేదాన్‌, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్ది సమయం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *