సిపిఐ అ‘విశ్వాసం’కు దూరం

పార్టీ నిర్ణయంమేరకే గైర్హాజరు
ఇల్లందు :  ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌ పై అవిశ్వాసతీర్మానం విషయంలో సిపిఐ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఇల్లందు మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ కౌన్సిలర్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. విఠల్‌ రావు భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ అవిశ్వాస తీర్మాన సమావేశానికి పార్టీ ఆదేశాల మేరకు  గైర్హాజరు అయినట్లు తెలిపారు. సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. సొంత నిర్ణయాలకు తావులేదని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న అందుకు అనుగుణంగా నడుచుకుంటానని పేర్కొన్నారు.
నాలుగేళ్ళ కాలంలో ప్రజా సమస్యల పరిస్కారం కోసం కృషి చేశానని, రాజకీయాలు పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిస్కారంకోసం పాలకవర్గం కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకవర్గంలో ఎవరున్నా ప్రజలపక్షాన కమ్యూనిస్టు పార్టీ స్థానిక సంస్ధ ప్రజా ప్రతినిధిగా గళం విప్పుతానని, భవిషత్తులోనూ పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని రవీందర్‌ స్పష్టం చేశారు. సిసిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ కె సాబీర్‌ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *