‘‘కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు.’’
భారతదేశం మణిపూర్ లో జరిగిన సంఘటన పై తలదించుకొని సిగ్గు పడాల్సిన పరిస్థితిని పాలకులు తీసుకువచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు నిత్యం ఏదో ఒక చోటన బహిరంగంగా, అంతర్గతంగాను కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనల పైన రాయాల్సిన పరిస్థితిలో భారత దేశ వ్యవస్థలో నేటికీ ఉన్నాయంటే భారతదేశం ఎటువైపు వెళుతుందో ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం. అసలు ఆ ప్రాంతంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం..
ఫాసిజంలో భాగంగా 2000 మంది కుకీ గ్రామం పై విరుచుకు పడ్డారు.. ఇండ్లను తగలబెట్టారు.. మగవాళ్ళను చంపారు.. పోలీసులు విషయం తెలిసి అక్కడికి చేరుకునే లోపు రెండు కిలోమీటర్లు బయలుదేరారో లేదు కేవలం రెండు కిలోమీటర్ల తర్వాత ఫాసిజం ఆమలు చేసే గుంపు అడ్డుపడి వ్యానుకు అందులో ఉన్న ముగ్గురు మహిళలను పోలీసులు బెదిరించి చరబట్టి బలవంతంగా వివస్త్రాలను చేసి రెండు కిలోమీటర్లు మేర పట్ట పగలు నడిపించుకుంటూ వెళ్లారనేది సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. ఇద్దరు మహిళలు ముగ్గురు మహిళలు అంటూ ప్రచారం కొనసాగుతున్న తరుణంలో ఇద్దరు ముగ్గురు సంఖ్యా ప్రామాణికం కానప్పటికీ మహిళల దుర్మార్గమైన సంఘటనలు నేటికీ చోటు చేసుకోవడం అంటే భారతదేశం ఎటువైపు ప్రయాణిస్తుందో భారతదేశంలో అమలవుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా భారత పౌరులు రాకపోతే ఈ సమస్య ప్రతి ఇంటిని తట్టుతుందనే చెప్పవచ్చు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం వాటిని ప్రోత్సహించడం మరియు ముఖ్యంగా మతాలవారీగా చర్చలు రేపుతూ హిందుత్వమే ఏజెండ గా ముందుకు పోతూ బహిరంగ ప్రదేశాలలో దాడులు చేస్తూ తిండిపై ఆంక్షలు పెడుతూ కూడు గుడ్డ అనేక రకాల వ్యక్తిగత వ్యవస్థలపై ఆంక్షలు విధిస్తూ మానవుడు మానవునిగా బతికే పరిస్థితిని భారతదేశంలో లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన సమాజంలో నేడు మనం ఉన్నాం. .
రెండు గంటల క్రితం గ్రామం పైన దాడి జరిగినప్పుడు ఆ ఏకపక్ష దాడిలో తండ్రి కూడా మరణించడం, ఆ బాధితురాలని ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేయడం తనతో పాటు ఉన్న ఇద్దరు మహిళలకు కూడా అదే గతి పట్టించడం ఆ దుర్మార్గులు చేసినటువంటి సంఘటన విషాదకరమైనది. దేశానికి నాయకత్వం వహిస్తున్నాము భారతదేశ అభివృద్ధి పదంలో ఉందని చెప్పుకుంటున్న మోదీ అమిత్ షా లు ఇలాంటి సంఘటనలు రోజుకు ఏదో ఒక చోట పునరావృతం అవుతున్నప్పటికీ మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని చెప్పవొచ్చు . భారతదేశంలో జరుగుతున్న అల్లర్లను ఆపడంలో మోదీ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఉన్న సాయుధ బలగాల సహాయంతో నైనా అల్లర్లను ఆపి ప్రజలను రక్షించాల్సిన పాలకులు , ప్రజలపై ఉసిగొల్పి దాడులను ప్రోత్సహిస్తున్నారు. సాయుధ బలగాలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది అయినప్పటికీ దాడులు అల్లర్లు జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు.. దాని వెనుక ఉన్న కుట్రలను తెలుసుకోనంత కాలం ప్రతి మానవుడు ఇలాంటి సంఘటనకు గురి అయ్యే ప్రమాదముంది . మతతత్వం కులాలు మధ్య గొడవలు కాదు వ్యక్తిగత గొడవలు అంటూ బూచి చూపుతూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాంటి గొడవలకు. అల్లర్లకు దారులకు నాంది పలుకుతూ వారిని చెప్పకనే చెబుతూనే ప్రోత్సాహం చేస్తూ సంఘ టనలను పదేపదే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయంటే ఇలాంటి ఘటనలకు కారణం ఎవరని ఆలోచన ప్రజల మెదళ్ళో కదులుతూనే ఉన్నాయి. తెగల మధ్యల గొడవలను చెబుతూ చర్చిలను తగలబెడుతూ పాస్టర్లను వెతికి వెతికి చంపుతూ దళితుల పైన దాడులు చేస్తూ తినే తిండిలో మూత్రం పోస్తూ వ్యక్తులపైన దాడులు చేసి పైచాచిక ఆనందం పొందుతున్న పరిస్థితులు నేడు భారతదేశంలో ఉన్నాయి. మణిపూర్ లో ఆరు నెలలుగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ వాటిని ఆపడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు పాలకులు సమాధానం చెప్పాల్సిందే.
భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘ టనలపై ప్రతి ఒక్కరు మౌనం వీడి మాట్లాడాల్సిన అవసరం ఉంది సమస్యను ప్రతి ఒక్కరిదాకా రాకముందే పక్కవారి సమస్యను మన సమస్యగా భావించి ముందుకు వెళుతూ ప్రజాస్వామ్య భార తదేశ వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు మనం మౌనం వీడి మాట్లాడదాం. మణిపూర్ తో పాటు ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వాటికి కారణమవుతున్న నేరస్తులను కఠినంగా శిక్షించేలా పోరాటం చేద్దాం..
– వి.గో
సామాజిక కార్యకర్త




