సాహితీరథి… దాశరథి

నవ కవన జలధి
జాగృత పద్య నిధి
సాహితీ రథ సారథి
ప్రజా ఉద్యమ వారధి
అతడే విశ్వ జగత్ప్రసిద్ధి
దాశరథి కృష్ణమాచార్యులు

తెలంగాణ దాస్య విముక్తికి
కలం పోరు సాగించిన వీరుడు

కుహనా వర్గ సమాజంపై
ధిక్కార స్వరమెత్తిన ధీరుడు

నిజాం నిరంకుశ పాలనపై
అక్షరం సంధించిన యోధుడు

రజాకారుల గుండెల మీద
కవనబాకు దించిన విప్లవుడు

రాచరికపు దాష్టికాల మీద
పద్య ఫిరంగి పేల్చిన ఘనుడు

బూర్జువ శక్తుల ఎదల మీద
రుద్రవీణ మోగించిన శూరుడు

జమీందారి ఆధిపత్యం మీద
అగ్నిధార కురిపించిన రౌద్రుడు

గాలీబు గజళ్ళు షాయరీలతో
మైమరిపించిన సాహితీ రేడు

తెలంగాణ కోటిరత్నాల వీణ
అంటూ చాటిన ఆదర్శకాడు

తరాల బూజు నిజాం రాజని
తేల్చి చెప్పిన విక్రమార్కుడు

తిమిరంతో సమరం చేసి
గెలిచి నిలిచిన అమరుడు

అతిరథ మహారథి దాశరథి
తెలంగాణ తల్లి కిరీటంలో
కవన రత్నమై ప్రకాశిస్తాడు

తూరుపు కనుమలలో
సాహితీ సూరీడై ప్రభవిస్తాడు

(జులై 22 న దాశరథి జయంతి సందర్బంగా అక్షర ప్రణతి అర్పిస్తూ…)
   – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *