- ప్రజల కోరిక మేరకే ప్రభుత్వ పాలన
- మీడియాతో మంత్రులు
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఆదివారం భద్రాద్రి రాముని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోసం మంత్రులకు స్వాగతం పలికిన భద్రాద్రి దేవాలయం అధికారులు, అర్చకులు. రామాలయం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు. లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో మంత్రులకు వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు మంత్రులకు స్వామివారి చిత్రపటం ఇచ్చి ప్రసాదాన్ని అందజేసిన దేవాలయం కార్యనిర్వాహణ అధికారి రమాదేవి. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజల ఇష్టాలు, కోరికలకు అనుగునంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పారు.

భద్రాద్రి ఆలయం మతసామరస్యానికి ప్రతీకని చెప్పారు. రాములవారి పెళ్ళికి ముస్లిం రాజు తానిషా ప్రభువు ముత్యాల తలంబ్రాలు పంపి మతసామరస్యాన్ని కాపాడుతూ లౌకికవాదాన్ని పెంపొందించారన్నారు. తమ ప్రభుత్వం దేశంలో లౌకికవాదం ఎల్లప్పుడు విలసిల్లాలని కోరుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వమని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని రాముల వారిని వేడుకున్నామని చెప్పారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి భద్రాద్రి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.





