వ్యవసాయమే భవిష్యత్‌కు భరోసా!

అత్యాధునిక సాగు పద్ధతులపై అవగాహన అవసరం..
మహిళా రైతులకు శిక్షణ ఇవ్వాలి..

వ్యవసాయమే భవిష్యత్‌ తరాలకు భరోసానిస్తుందని   ఇటీవల  జాతీయ వ్యవసాయం, వ్యవ సాయ ఆధారిత పనిముట్లు పరికరాల  ప్రదర్శనలో పాల్గొన్న సందర్బంగా అవగతమైంది .  ఆ ప్రదర్శనలో అత్యాధునిక వ్యవసాయ ఉద్యాన  సాగు పరికరాలు, అనుబంధ పశు పోషణ కు సంబంధించిన యంత్ర పరికరాలు ఎన్నో  ప్రదర్శించారు. వ్యవసాయ రంగం లో జరుగుతున్న ఆధునిక మార్పులను గమనిస్తే భవిష్యత్‌ తరాలకు బంగారు బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. టెక్నాలజీని ఉపయోగించి భూసారా పరీక్ష మొదలు ఏఐ (ఆర్టిఫిషల్‌ ఇంటెలీజెన్స్‌) తో చేసే ప్రయోగాలు అగ్రిటెక్‌ లో విజయవంతమవుతున్నాయి. నీటి వృథా కాకుండా అతివృష్టి అనావృష్టిలను అరికట్టి పంట నష్టాన్ని నివారించవచ్చు  వానాకాలం వార్తలను ఏఐ తో ముందుగానే పసిగట్టి కాలానికి తగు పంటల్ని వేయచ్చని ఇటీవల ప్రయోగాలు చెబుతున్నాయి.

ఇలా టెక్నాలిజీని ఉపయోగించి కృత్రిమ పద్దతిలో సాగుకు నీరు, మందుల ఖర్చు తగ్గదమే కాకుండా 25 శాతం దిగుబడి పెరుగుతుందని సందర్శకులు అభిప్రాయపడ్డారు. మహిళా రైతులకు శిక్షణ అవసరం: భారత దేశ0 వ్యవసాయక దేశం. ప్రప0చ0లో అత్యధిక జనాభా గల దేశాలలో రె0డవది. ఇ0దులో 80 శాతం ప్రజలు గ్రామీణులు 68-70 శాతం మంది వ్యవసాయ రంగ0లో ఉన్నారు, జనాభాలో సగభాగం ఉన్నమహిళలు వ్యవసాయ పనులలో చురుకుగా పాల్లో0టున్నారు. విత్తనాలు విత్తుట మొదలుకొని కోతల వరకు అన్ని పనుల్లోనూ మహిళలు భాగాస్వాములవుతున్నారు. దేశ భవిష్యత్తు పల్లె ప్రగతి..  పల్లె ప్రగతి కుటుంబ ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. ఓ మహిళా రైతు మధ్య ప్రదేశ్‌ లో డ్రోన్‌ ని ఉపయగించి పంట తెగుళ్లను నివారించే మందులతో పిచికారీ చేయడం వల్ల సగటున నెలకు రూ.50వేల సంపాదిస్తోంది.  అంటే టెక్నాలజీ తో ఆదాయానికి రెండిరతలు చేయొచ్చన్నమాట.

సేద్యంలో డ్రోన్‌ టెక్నాలజీ: ఇటీవల జరిగిన కేంద్ర  కృత్రిమ మేధ (ఏ ఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), మానవ రహిత వైమానిక వాహనాలు (యూఏవీలు డ్రోన్‌  లు), వ్యవసాయ, ఇతర అత్యాధునిక సాంకేతికతలకు సంబంధించిన అమలుపై విస్తృత చర్చలు జరిగాయి. ఉత్పత్తి నుండి వినియోగం వరకు, పంట అనంతర నిర్వహణ,  మార్కెటింగ్‌తో సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సాంకేతికతలు రియల్‌ టైం డేటా, పరిణామ అంచనా విశ్లేషణ  తద్వారా ప్రపంచ జనాభా పెరుగుదల, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించవచ్చు. క్రియాత్మక అంతర్దృష్టులతో రైతులను ఎలా శక్తివంతం చేయగలనే అంశాలను అన్వేషించారు. అయితే మారుతున్న కాలంతో పాటు, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన డ్రోన్‌ల వినియోగాన్ని పెంచడం ఎంతయినా అవసరం. డ్రోన్‌ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్‌ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.

పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్‌ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్‌ ఇమేజ్‌ ద్వారా తమ పొలం చిత్రాలను స్పష్టంగా చూడవచ్చు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. డ్రోన్‌ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు. తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగు మందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్‌లో పొందుపరిచారు. ఏఐ టెక్నాలజీ తో ప్రణాళిక ప్రకారం చేసుకోవచ్చు నేలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అందులో ఉన్న పోషకాలను పసిగడుతూ లోపించిన పోషకాలను భర్తీ చేస్తూ సరిపడా ఎరువులను వాడొచ్చు. దీనివలన రైతులకు అవసరం లేని ఖర్చులను తగ్గిచడమే కాకుండా నేలలో పేరుకుపోయిన అవసరం లేని రసాయనాలను తొలగించవచ్చు.  సరైన అవగాహన లేక ఎక్కువ ఎరువులు వేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది. తక్కువ వేస్తే పంటల దిగుబడులు  దెబ్బతింటాయి. భూసార స్థాయిని బట్టి తగినంత మోతాదుల్లో ఎరువుల నిర్వహణ చేస్తే తగిన మోతాదుల్లో పంట దిగుబడి వస్తుంది. అని అగ్రి సైంటిస్ట్‌ ల మాట. అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు చల్లడానికి, శ్రమ, శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

అయితే భారతీయ వ్యవసాయ రంగం పెరుగుతున్న జనాభాకు ప్రతిస్పందనగా ఆహార భద్రతను ప్రోత్సహించడంలో ఒక నిర్దిష్ట ద్వంద్వత్వంలో నడుస్తుంది, అయితే అదే సమయంలో పర్యావరణ స్థిరత్వం,  స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంచడంలో, ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో. క్లైమేట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌ భావన ఈ ద్వంద్వత్వం గుర్తింపు నుండి ఉద్భవించింది. ఇండియన్‌ సోషల్‌ అకౌంటింగ్‌ మ్యాట్రిక్స్‌ 2017-18 ప్రకారం వ్యవసాయము దాను అనుబంధ ఉత్పత్తుల వల్ల ఆర్థిక-వ్యాప్త ప్రభావాలను అంచనా వేయబడిరది, పరిరక్షణ వ్యవసాయం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని అధిగమించవచ్చు.

వ్యవసాయ అనుబంధ స్టార్టప్‌ ల ప్రోత్సామం, సాంకేతికతను ఉపయోగించి సాగుబడి చేస్తే.. శ్రమ సమయము కలిసి వచ్చే అవకాశము ఉంది తద్వారా వంద శాతం వనరుల్ని పూర్తిగా ఉపయోగించవచ్చు.  వ్యర్దాలు లేకుండా నేల సారం దెబ్బతినకుండా నీరు కలిషితం కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా చేయవచ్చు. అలాగే వ్యవసాయ  నిర్వహణ ఖర్చులు తగ్గించి ఆహార ఉత్పిత్తిని రెట్టింపు చేసే సామర్థ్యం ఈ కృత్రిమ మేధ టెక్నాలిజీతో సాధ్యమే.  పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహారమే కాదు..  ఉద్యోగ భద్రత కల్పించడం  తదనంతర ఉపాధి అవకాశలు పొందడం.. నిరుద్యోగ సమస్యను నివారించడం ఈ ఏఐ ఆధారిత  వ్యవసాయం ద్వారా సాధ్యమేనని అంటున్నారు అగ్రి సైంటిస్టులు. అందువల్ల సరికొత్త టెక్నాలజీని వినియోగించుకని రైతు రాజుగా నిలవడం ఖాయమే.
-డా.కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ డ ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌, 9705890045.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *