దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ క్రియేట్ చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ స్వయంగా అంధకారంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. పవర్ సెక్టార్‌ను గాలికొదిలేసి పాలకులు గంజా, డ్రగ్స్ పార్టీల్లో బిజీగా ఉన్నారన్నారు. బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు కేసీఆర్ ఫీలవుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిందని అర్వింద్ ఆరోపించారు. తన తండ్రిపై అలిగిన కవిత కాంగ్రెస్ లోకి వెళ్తానని.. ఖర్గేకు ఫోన్ చేసిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే లక్నోకు తీసుకెళ్లారన్నారు.
తన కూతురు తన వెంటే ఉన్నారని తెలిసేందుకు మీడియా ముందు డ్రామా ఆడారన్నారు. కవిత, కేటీఆర్ లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోనే అత్యధికంగా యూనిట్ విద్యుత్‌కు 9.50 రూపాయలు వసూలు చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. తెలంగాణ వస్తే.. పది కొత్త ధర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు లిక్కర్ స్కామ్ పార్టనర్స్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ కరెంటు బిల్లులు కట్టేందుకు సరిపోవటంలేదని తెలిపారు. విద్యుత్ శాఖలో ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారలో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ వైఫల్యాలపై కేంద్రం తమను రిపోర్టు ఇవ్వాలని కోరిందన్నారు. 25 సెక్టార్స్ పై ప్రస్తుత అధ్యయనం కొనసాగుతుందని తెలిపారు.
కేటీఆర్,కవిత రాష్ట్రంతో పాటు కేసీఆర్ ను కూడా భ్రష్టుపట్టించారన్నారు. ఎక్కువ రేటుకు కరెంట్ కొని రాష్ట్ర ప్రజలపై భారం మోపారన్నారు. కేసీఆర్ , కేటీఆర్ కు రాష్ట్రం మీద నియ్యత్ లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 10 ధర్మల్ పవర్ లాంట్‌లు పెడతానని చెప్పిన కేసీఆర్.. కేవలం ఒక్కటే మాత్రమే కంప్లీట్ చేశారని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా పూర్తికాలేదన్నారు. ఫ్రీ కరెంట్ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫించన్.. కరెంటు బిల్లులకు కూడా సరిపోవడం లేదని విమర్శించారు.




