విద్యకు, విద్యావంతులకు విలువిచ్చే రోజులు గతించాయి. అంద రికీ విద్యా వకాశాలు అందుబాటు లోకి వచ్చిన నేథ్యంలో, ప్రతీ ఒక్కరు చదు వుకుంటూ, పట్టాలు సంపాదిస్తున్న వర్తమానంలో నాణ్యమైన విద్య కోసం పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైనది. మారు తున్న పరిస్థితుల్లో అర్ధవంతమైన చదువులు అత్యంత అవసరం. అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు పయనింప చేసే శక్తి కేవలం ఉపాధ్యాయులకే సాధ్యం. దేశ ప్రగతి సాధన ఉత్తమ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పి, విద్యార్థుల్లో నైపుణ్యానికి ఉపాధ్యాయులు, విద్యావంతులు కృషి చేయాలి. కంఠస్థం చేయడం వలన కంఠశోష తప్ప ప్రయో జనం శూన్యం. దురదృష్ట వశాత్తూ ఈనాటికీ దేశంలో చాలా మందికి విద్యావకాశాలు గగనకుసుమంలా మారాయి. కొన్ని దేశాల్లో స్త్రీలకు చదువుకునే స్వేచ్ఛ లేదు. మరికొన్ని దేశాల్లో కుటుంబాల ఆర్ధిక స్థోమత సరిగా లేక, చదువుకునే అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. బాల కార్మికులుగా,వీధి బాలల్లా మిగిలి పోతు న్నారు. ఒక వైపు ఇలాంటి పరిస్థితులు తాండవిస్తుంటే, మరొకవైపు నాణ్యత లేని విద్యల వలన ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయి. నైపుణ్యం లోపించిన చదువుల వలన ప్రపంచ ప్రగతి సాధ్యం కాదు.ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పడం లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేసి, విద్యార్ధులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి.విద్య యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా సంస్కరణలు రావాలి. నిజమైన విద్యకోసం పాటుపడాలి. సాంకేతిక రంగాన్ని చెడిపోవడానికే వినియో గించుకునే విద్యార్థుల ధోరణిలో మార్పురావాలి. వాస్తవ ప్రపంచానికి దూరంగా, రంగుల లోక ంలో విహరిస్తూ పెనుభారంగా తయారైన యువత చాలా ప్రమాదకరం. ఊహల్లో తేలియాడే ప్రపంచానికై ఉర్రూతలూగుతున్న యువతను సంస్కరించాలి.
తల్లిదండ్రుల దృక్పథంలో కూడా మార్పు రావాలి.తల్లి దండ్రులు ఒక స్థాయి వరకు తమ పిల్లలను తమ వద్దే పెరిగేటట్టు చూడాలి. బాహ్య ప్రపంచంలోని అనైతిక ధోరణుల వలన కలిగే పర్యవసానాల గురించి తెలియచెప్పాలి. ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి పట్ల అంకితభావం ప్రదర్శించాలి. భావితరాన్ని మేథాశక్తి సుసంపన్నులుగా తయారు చేయడంలో వారి పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.’’విద్యా లయం’’ అనే ఉద్యానవనంలో విజ్ఞానంతో విరబూసిన పువ్వులే విద్యార్థులు.ఉపాధ్యాయుల ఆలోచనల్లోనే నిజమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి సాధనకై ఉపాధ్యాయులు నిరంతర విద్యార్ధులై శ్రమించాలి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాలి. ఉపాధ్యాయుల ధ్యాసంతా విద్యార్థులపై కేంద్రీకరించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధిం చవచ్చు. విద్యార్ధులను నాణ్యమైన విద్యాబోధనతో అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం.. విలువలతో ఉత్తమపౌరులుగా తయారు చేయడం. అందుకు అనువైన పరిస్థితులను ప్రభుత్వాలు నెలకొల్పాలి.
ఏ దేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిం చినప్పుడే ప్రజలకు సజావుగా జీవించడానికి మౌలిక సదుపాయాలు అందుతాయి. జీవనోపాధి లభిస్తుంది.
ఏ దేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిం చినప్పుడే ప్రజలకు సజావుగా జీవించడానికి మౌలిక సదుపాయాలు అందుతాయి. జీవనోపాధి లభిస్తుంది.
ప్రజలంతా ఎలాంటి ఒడిదు డుకులు లేకుండా జీవించగలిగినప్ఫుడే అలజడులు, అరాచకాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడి, శాంతి భద్రతలు నెలకొని, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. వీటన్ని ంటికీ మూలాధారం విద్య. విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. విద్య ద్వారా సాధిం చలేని దంటూ ఏదీ లేదు. అలాంటి నాణ్యమైన విద్య దేశంలో ప్రతీ ఒక్కరికీ అందాలి.సక్రమమైన విద్యల వలన విద్యావంతులు విభిన్న రంగాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశాభివృద్ధిని శిఖరాగ్ర భాగంలో నిలబెట్టగలరు మనిషి పరిపక్వత కు విద్య అవసరం. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలి. విద్యార్ధులను అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చి దిద్దాలి. అప్పుడే మనం ఆశించిన నిజమైన దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. విద్యార్ధులంతా విలు వలతో కూడిన నవ ప్రపంచాన్ని సృష్టి ంచాలి. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించాలి. ప్రభుత్వ విద్య ,ప్రైవేటు విద్య అనే తారతమ్యం లేకుండా విద్యను ఒకే గొడుగు క్రిందకు తీసుకు రావాలి. అన్ని స్థాయిల్లోను విద్యను అందరికీ ఉచితంగా అందించాలి.
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడె, ఏపీ
9704903463.




