కొత్తకొత్త సూర్యోదయాలు
కొంగొత్త ఆలోచనల దారుల్లో
కోరికలుదయిస్తుంటయ్
ఊహలకు రెక్కలొస్తుంటే..
మనిషి విహంగమై సంచరిస్తూ
ఆకాంక్షలనెన్నో అద్దుకుని
ఆరాటంగా పోరాటంచేస్తూ
నిరాశతీరాలెన్నెదురొచ్చినాజి
పయనమైతే సాగుతుంటది
తన స్వప్నాల సాకారానికై
భవిష్యత్తుకు గౌరవాన్నద్దుకోవాలని
వర్తమానాన్ని చెక్కుతున్న శిల్పౌతున్నడు
వెనుదిరగని ధీరుత్వాన్నద్దుతున్నడు
అడుగడుగునా అడ్డంకుల శిఖరాలనదిరోహిస్తూ
అలుపులేనితనాన్ని మదినింపుకుని
మౌనమునిలా దీక్షబూని అరిషడ్వర్గాలను జయిస్తూ
చైతన్యగీతమై ఉదయిస్తున్నడు
నేడు పోటిపడడమంటే సప్తసముద్రాలీదడమే
సాధించడమంటే యుద్ధాన్ని గెలవడమే
అపజయాలెన్నెదురౌతున్నా
తిరిగి పోటిలో నిలవడమే
విజయపుదారుల్లోకి వినయంగా చేరడమే
దూరమెంతున్నా భారమనకుండా గెలుపుతీరంకై సాగాల్సిందే
ఎవరైనా ఎక్కడైనా..!
– సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,
9010480557.




