- ఆధారాలతో మరణించిన వారి వోట్లనే తొలగించాం
- తెలంగాణలో సమానంగా స్త్రీ, పురుష వోటర్లు
- ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే వోటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. తెలంగాణలో ఏకపక్షంగా వోట్లు తొలగించామనడం సరికాదన్నారు. 2022`23లో 22 లక్షల వోట్లు తొలగించామన్న ఆయన…డెత్ సర్టిఫికెట్లు ఉన్న వాటినే వోటర్ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్ వొచ్చిన తర్వాతే వోటర్లను జాబితా నుంచి పేర్లు తొలగించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వోటింగ్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వోటర్ల జాబితాను ఎంతో పారదర్శకంగా రూపొందించినట్లు వెల్లడిరచారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై సవిూక్ష కోసం రాష్ట్రానికి వొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి హైదరాబాద్లో విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభ పరిణామమని పేర్కొన్నారు. యువ వోటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. 2022`23 ఏడాదిలో 22 లక్షలకు పైగా వోట్లను పరిశీలించి తొలగించినట్లు తెలిపారు. ఏకపక్షంగా వోట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. ఫామ్ అందిన తర్వాతే వోట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. జూలై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు వోటు హక్కు కల్పించామన్నారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా వోటర్లే అధికంగా ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల యువ మహిళా వోటర్లు 3.45 లక్షలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా, ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు వోటర్ల సంఖ్య 897గా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు.
ఆయా పార్టీల సూచనలు, సలహాలను స్వీకరించామన్నారు. ఎన్నికల ఖర్చు పెంచాలని కొందరు అడిగారని చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 3.17 కోట్ల మంది వోటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ట్రాన్స్ జెండర్లు 2,557, వందేళ్లు దాటిన వోటర్లు 7,600 మంది ఉన్నారని తెలిపారు. 8.11 లక్షల మంది యువకులు తొలిసారి వోటు హక్కు వినియోగించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జూలై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు వోటు హక్కు కల్పించామన్నారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా వోటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న రాజీవ్ కుమార్, 18`19 ఏళ్ల యువ మహిళా వోటర్లు 3.45 లక్షల మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు వోటర్ల సంఖ్య 897గా ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను వోటింగ్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయని తెలిపారు. వోటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయన్నారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో సవిూక్ష నిర్వహించింది సీఈసీ. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్టాల్రుగా తెలంగాణ, ఆంధప్రదేశ్ ఉన్నాయన్న ఈసీ బృందం, ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వొస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, కానుకలు స్వాధీనం చేసుకోవడం లేదని అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటే ప్రలోభాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఈసీ అభిప్రాయపడిరది. అధికారులు కూడా అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో క్రమంగా ఎన్నికల హింస తగ్గుతుందని, ఇదే సమయంలో ప్రలోభాలు పెరుగుతున్నాయని, హింస తగ్గేందుకు డబ్బు, మద్యం పంపిణీ కూడా ఒక కారణమని అధికారుల సవిూక్షలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.




