లోపాలు లేని సమాచారం పొందుపరచాలి

– అధికారులకు సీఈవో ఆదేశాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 3 : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మ తేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై  ఆయన అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటలైజేషన్ పురోగతి, సంబంధిత అంశాలను సమీక్షించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా గైర్హాజరైన, నివాసం మార్చుకున్న, మరణించిన, నకిలీ ఓటర్ల జాబితాల పునఃపరిశీలన, విశ్లేషణ, నో మ్యాపింగ్ కేసులు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని లోపాలను అత్యంత ఖచ్చితత్వంతో సరిదిద్దాలి. అన్ని ఏఎస్‌డీడీ కేసులను తుది నిర్ణయానికి ముందు పునఃపరిశీలించి సరైన వర్గీకరణ చేయాలి. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపు లేకుండా లేదా పొరపాటున తొలగించడం కాకుండా చర్యలు తీసుకోవాలి. లోపాలు గుర్తించిన సందర్భంలో రోల్ బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి, రికార్డులను మళ్లీ పరిశీలించి అవసరమైన సవరణలు చేయాలి. బూత్ లెవల్ అధికారుల, బూత్ లెవల్ సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారుల ద్వారా క్షేత్రస్థాయి ధ్రువీకరణను మరింత బలోపేతం చేయాలి. బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల మినిట్స్‌ను, గుర్తింపు పొందిన పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సంతకాలతో సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. 85 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి సంబంధించిన వ్యత్యాసాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంతోపాటు, భారత ఎన్నికల సంఘం  మార్గదర్శకాల ప్రకారం గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు విభజన జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అండ్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని పట్టణ జిల్లాల జిల్లా ఎన్నికల అధికారుల పురోగతిని ప్రధాన ఎన్నికల అధికారి సమీక్షించారు. నో మ్యాపింగ్ కేసులు, ఏఎస్‌డీడీ కేసులు, అసంగతలు, సేకరించని ఎన్యూమరేషన్ ఫారాలు, ఇతర పెండింగ్ అంశాల పరిష్కారానికి సంబంధించి వారి కార్యాచరణ ప్రణాళికలను తెలుసుకుని తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సాధారణ పరిపాలన(ఎన్నికలు) శాఖ అదనపు కార్యదర్శి ఎన్.శంకర్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి(ఎఫ్‌ఏసీ) జి.ఎస్.చారి, జీహెచ్ఎంసీ కమిషనర్ అండ్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికా రుల, ఎన్నికల నమోదు అధికారులు, నోడల్ అధికారులు, సంబంధిత సెక్షన్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్(ఐటీ) తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *