రేపు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..?
తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : రేపు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. అయితే చర్చించే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల 8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 9న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టి 12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇక 6 గ్యారంటీలలో మరో రెండు పథకాలు రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేయనున్నట్లు సిఎం ప్రకటించిన నేపథ్యంలో వాటిపై కూడా రేపటి కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *