రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం

తొమ్మిదన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై నేడు కెటిఆర్‌ ‘స్వేద పత్రం’
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే తాము ఊరుకునేది లేదని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల, రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపణల నేపథ్యంలో ఆయన శుక్రవారం కౌంటర్‌ ఇచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల బిఆరెస్‌ పాలన రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో…దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమని ఆయన అన్నారు. రాత్రి…పగలు చెమటోడ్చి తాము తెలంగాణను నిర్మించామని కెటిఆర్‌ తెలిపారు.
తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమ తొమ్మిదన్నేరేళ్ల పాలనపై ఆయన నేడు తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం’ పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు కెటిఆర్‌ వెల్లడిరచారు. గణాంకాలతో సహా వాస్వవ పరిస్థితులను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. తమ హయాంలో రాష్ట్రం సృష్టించిన సంపదను ఈ పవర్‌ పాయింట్‌ లో ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *