నీచత్వం ముసుగులో
నడుస్తున్న బడా నాయకత్వం
అధికారానికలవాటుపడి
అభివృద్ధికి సమాధికడుతున్నరు
పేదలందరిని బయటపడని
అంధకారగాధంలోకి నెట్టెస్తున్నవైనం
బానిసత్వానికలవాటుపడిన బతుకులకు మెతుకులేమోగానీ
మైకంకమ్మే మందుసీసలిసిరి
ధగాకోరు దౌర్జన్య రాజకీయాలతో
అట్టడుగువర్గాలననిచేస్తరు
మనువాదులంతేకమౌతుంటే
బహుజనులు బజనబృంధాలౌతరు
కసాయోన్ని నమ్మడమే తెలుసోల్లకు
భవిష్యత్తుకు బానిసత్వాన్ని బహుమానమందిస్తరు
పల్లకిబోయిలై బతుకెల్లదీస్తరు
కళ్ళముందుకనవడేది నమ్మని
సాధుజంతువులౌతరు
రాజ్యాంగానికి సైతం
ఘోరి కట్టేందుకు సిద్దమౌతున్నా దద్దమ్మలై మౌనంగుంటరు
కల్పించిన హక్కుల్నొక్కొక్కటి
కాలరాస్తుంటే
బసవన్నలై బస్మమైపోతరు
సంపదంతా ఉన్నోడి పాదక్రాంతమౌతుంటే
బినాములై సలాంజేస్తరు
అదే చాలంటూ కడుపులో ఆకలిదాచిపెడ్తరు
ముసుగుదొంగలై కాపలగుంటరు
నిజాన్ని ఏమెరుగనట్లు
కడుపులదాచేసి
కాలనాగులచెరలో
కాటుకు వెరవక కాలమెల్లదీస్తరు
గొంగళిపురుగులాంటి భ్రమణంలోనే బతుకు
అందమైన సీతకోకచిలకలా
పరిణామమేలేని చీదరింపుల జీవనగమనం
రాజకీయ రాక్షసత్వక్రీడలో
దారిద్య్రపు లక్ష్మణరేఖలు దాటని సామాన్యులు
– సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు, 9010480557.




