రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు

  • కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం
  • బస్సు డ్రైవర్‌ ‌తప్పిదమే అని గుర్తించిన పోలీసులు

లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్‌ ‌బస్‌ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బాలలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్‌ ‌పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం ఉదయం 6 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్‌ ‌బస్సు రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వస్తూ, ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సులో సీఎన్‌జీని నింపుకున్న తర్వాత ఆ బస్సును రాంగ్‌ ‌రూట్‌లో అతి వేగంగా నడిపారని పోలీసు అధికారి కుష్వాహా చెప్పారు. ఈ బస్సు నోయిడాలోని బాల భారతి పాఠశాలకు చెందినదని చెప్పారు. బస్సు డ్రైవర్‌ ‌తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు, ప్రమాదానికి గురైన కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరు రట్‌ ‌నుంచి గురుగ్రామ్‌ ‌వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. రోడ్లపై రాంగ్‌ ‌రూట్‌ ‌డ్రైవింగ్‌ ‌సర్వ సాధారణమైపోయిందని ప్రజలుఆరోపించారు. వాహనదారులు యథేచ్ఛగా రాంగ్‌ ‌రూట్‌లో వెళ్తున్నప్పటికీ ట్రాఫిక్‌ ‌పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బస్టాపుల్లో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికుల దకు దూసుకెళ్తూ వాహనాలను నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *