రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం పేద దేశాల ఆహార భద్రతకు పెను ముప్పుగా మారనుందా?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది రష్యా,ఉక్రెయిన్‌ ‌యుద్ధ పరిణామాలు.సరిహద్దు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యా,ఉద్యోగ,వైద్య,ఆర్థిక,సాంకేతిక,వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో యుద్ధ ప్రభావము ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చూపుతూనే ఉంది. పేద దేశాలపై పెను ప్రభావం. ఉక్రెయిన్‌ ‌ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి.ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్‌ ‌కు 45 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా గోధుమలు,బార్లీ, పొద్దుతిరుగుడు,రాప్‌ ‌సీడ్‌,‌సోయా మరియు ఎరువులను ఎగుమతి చేస్తుంది.ఉక్రెయిన్‌,‌రష్యా ప్రపంచంలో ఎగుమతి చేయబడుతున్న గోధుమలలో 30%,మొక్కజొన్నలో 20%,పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో 50% వాటాను కలిగి ఉన్నాయి.రష్యా ప్రపంచ ఎగుమతుల్లో 15% వాటా కలిగి ఉంది.ఫిబ్రవరిలో రష్యా,ఉక్రెయిన్‌ ‌మధ్య యుద్ధం ప్రారంభంమైనప్పట్టి నుంచి ఆహార ధాన్యాల సప్లైకి అంతరాయం ఏర్పడింది.ఇది ప్రపంచంలో చాలా దేశాలలో ఆహార సంక్షోభానికి దారి తీసింది.యూరప్‌ ‌ఖండంతో పాటు లాటిన్‌ అమెరికాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది.ముఖ్యంగా ఆఫ్రికా,మధ్య ప్రాచ్య, ఆసియాలోని పేద దేశాల్లో గోధుమలు తదితర ఆహార ఉత్పత్తుల సప్లైకి అంతరాయం ఏర్పడి ఆ దేశాల్లో తీవ్ర ఆహార సంక్షోభ పరిస్థితిని సృష్టించింది.

సుమారు 100 మిలియన్‌ ‌ప్రజలకు ఆహార కొరత ఏర్పడి,ఆహార భద్రత ప్రమాదంలో పడింది. అయితే ఈ సమస్య నుంచి పేద దేశాలను కాపాడడానికి,ఆహార భద్రత కల్పించుటకై ఐక్యరాజ్యసమితి చొరవతో టర్కీమధ్యవర్తత్వంలో ఆహార ధాన్యాల నిరంతర సరఫరా కోసం నల్ల సముద్రం పై ఆహార ధాన్యాల ఎగుమతులకై రష్యా,ఉక్రెయిన్‌ ‌మధ్య జులై లో ఆహార ధాన్యాల ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఉక్రెయిన్‌ ‌లోని ఒడెస్సా,చేరినోమోర్సక్ ‌మరియు యూజహనీ పోర్టుల నుంచి ఆహార ధాన్యాలు నల్లసముద్రం ద్వారా టర్కీ మీదుగా వివిధ దేశాలకు సరఫర చేయబడుతాయి.ఈ ఒప్పందం వల్ల సప్లై గొలుసు పునరుద్దరించబడి ఆఫ్రికా,ఆసియా లోని పేద దేశాలకు ఆహార ధాన్యాలు సప్లై చేయబడ్డాయి.అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు నియంత్రించగలిగి ఆహార సంబంధ ద్రవ్యోల్బణం ఇంకా పెరగకుండా నియంత్రించగలిగారు.
ఈ ఒప్పందం తర్వాత 397 నౌకలలో 9.5 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాలు ఎగుమతి చేయబడ్డాయి.ఆహార ధరలు మార్చిలో గరిష్ట స్థాయి నుంచి 15% తగ్గాయి. ముఖ్యంగా ఆఫ్రికా,ఆశయాలాంటి ఆహార కొరత ఉన్న దేశాల్లో సమస్య తీవ్రతరం కాకుండా ఈ ఒప్పందం ఉపకరించింది.
సమస్య మళ్ళీ మొదటికొచ్చింది.

రష్యా,ఉక్రెయిన్‌ ‌యుద్ధం వల్ల ఏర్పడ్డ ఆహార సంక్షోభ పరిస్థితికి పరిష్కారం దొరికిందని బాధిత దేశాలు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. గత వారంలో క్రిమియా సమీపాన నల్లసముద్రంలోని సేవాస్టోపోల్‌ ‌నౌక కేంద్రంలోని నౌకలపై డ్రోన్‌ ‌దాడి జరిగింది.దీంతో ఆగ్రహించిన రష్యా నల్లసముద్రం ద్వారా జరిగే ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.వాస్తవంగా ఈ ఒప్పందం నవంబర్‌ 19 ‌తో ముగియనుంది.దీంతో ఇప్పటికే రవాణాకు సిద్ధంగా ఉన్న రెండు వందల పైచిలుకు ఓడలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రష్యా ఒప్పందం నుంచి వైదొలుగుతుందని ప్రకటించిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో ఆహారధాన్యాల ధరలు ఐదు శాతం వరకు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో ఆహార సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడనుంది.ముఖ్యంగా ఇథోఫియా,సోమాలియా,కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలకు మరియు ఆసియా ఖండాలలోని పేద దేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభ పరిస్థితి తీవ్రంగా మారనుంది.దీనితో ఆసియా మార్కెట్లో కీలకమైన చమురు ధరలు కూడా పెరగనున్నాయి.ఐరోపా దేశాల్లో ఈ సంవత్సరం వేసవిలో హీట్‌ ‌వేవ్స్ ‌వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తులు బాగా తాగ్గాయి.ఈ ఒప్పంద నుంచి రష్యా తప్పుకోవడం వల్ల ఐరోపా దేశాల్లో కూడా దాని ప్రభావం చూపనుంది.

అయితే రష్యా అధ్యక్షులు పుతిన్‌ ‌మాట్లాడుతూ ఎగుమతి చేయబడిన ధాన్యంలో ఎక్కువ భాగం ప్రపంచంలోని ఆకలితో ఉన్న దేశాలకు కాకుండా ఐరోపా దేశాలకు సరఫరా చేయబడుతున్నట్లు ఆరోపించారు.కానీ యు ఎన్‌ ‌కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌ట్రేడ్‌ అం‌డ్‌ ‌డెవలప్మెంట్‌ ‌వారు విడుదల చేసిన నివేదిక ఈ ఒప్పందం ద్వారా ఎగుమతి అవుతున్న ఆహార ధాన్యాల్లో ఎక్కువగా పేద దేశాలకె సప్లై చేయబడుతున్నట్లు తెలిపింది. ఎగుమతి చేయబడిన గోధుమల్లో కేవలం 20 శాతం మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలకు సప్లై చేయబడినట్లు పేర్కొంది. యు ఎన్‌ ‌వరల్డ్ ‌ఫుడ్‌ ‌ప్రోగ్రాం నుంచి ఉపశమనం పొందుతున్న దేశాలకు ఒక లక్ష తొంభైవేల టన్నుల గోధుమలు పంపడంతో పాటు ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు ఐదు మిలియన్‌ ‌టన్నులకు పైగా ఎగుమతి చేయబడినట్లు ఉక్రెయిన్‌ ‌పేర్కొంటుంది. చర్చల ద్వారానే పరిష్కరాం. ఒప్పందం నిలిపివేయడం వల్ల దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది.భద్రతమండలి సమావేశంలో భారత దౌత్యవేత మధుసూదన్‌ ‌మాట్లాడుతూ ఈ చర్య ఇంధన మరియు ఎరువుల సరఫరా లాంటి ప్రస్తుత సమస్యలను మరింత దిగజార్చగలదని పేర్కొన్నారు.ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సంఘర్షణలు చర్చల ద్వారా పరిష్కారించుకోవలని సూచించారు.

ఒప్పందం కొనసాగుతుంది-రష్యా.
ఒప్పందం నుంచి రష్యా వైదొలిగిన తర్వాత భద్రతమండలి మరియు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావడంతో రష్యా రక్షణ మంత్రి మరియు అంకారాలోని ఉక్రెయిన్‌ ‌రక్షణ మంత్రి మధ్య జరిగిన చర్చల అనంతరం టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ ‌తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ‌రష్యా ఒప్పందంలో కొనసాగన్నుట్లు వెల్లడించారు. ‘‘ఈ రోజు మధ్యాహ్నానికి ముందు అంగీకరించిన విధంగా ధాన్యం రవాణా కొనసాగుతుంది’’ అని ఆయన చెప్పారు.కొద్దిసేపటి తర్వాత, రష్యా వార్తా సంస్థలు అతని వ్యాఖ్యలను ధృవీకరించాయి. సేఫ్‌ ‌కారిడార్‌ ‌మరియు ఉక్రెయిన్‌ ‌పోర్టులు ‘‘రష్యా కు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించబడవు’’ అని కైవ్‌ ‌నుండి రష్యాకు ‘‘వ్రాతపూర్వక హామీలు’’ లభించాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్‌ ‌కొనాషెంకోవ్‌ ‌చెప్పారు. ఆ హామీలు ప్రస్తుతానికి సరిపోతాయని రష్యా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

శాశ్వత పరిష్కారం అవసరం.
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది.ఆహార భద్రత లాంటి అంశాలలో ఆ ప్రభావం పేద దేశాలుపై తీవ్రంగా ఉంటుంది.రష్యా,ఉక్రెయిన్‌ ‌దేశాల మధ్య యుద్ధం పేద దేశాలకు శాపంగా మారరాదు.ప్రపంచ దేశాలు సాధించాల్సిన సుస్థిరాభిరుద్ది లక్ష్యాలలో ఆహార భద్రత ఒక్కటి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం అవసరం.ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సమాజం ఆహార భద్రత కోసం శాశ్వత పరిష్కారానికై కృషి చేయాలి.
– జుర్రు నారాయణ యాదవ్‌,‌తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌, ‌జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్‌, 9494019270.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *