- సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ పంచాయతీ పరిధిలోను, కొత్తగూడెంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే , మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారనికి కృషి చేస్తా అన్నారు.
రఘురాం రెడ్డి బయటి వ్యక్తి కాదని, ఆయన పుట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వృత్తిరీత్యా మరిపెడ బంగ్లాకి మారాడని గుర్తు చేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సొంత భూములు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబం అని అతని పేరులోనే సహాయం ఉందని, అందుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ప్రత్యర్ధులు ఓటమి భయంతోనే నాన్ లోకల్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. రఘురాం రెడ్డి పక్కా లోకల్ అని ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందుగా పొంగులేటి మాధురికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, హైమావతి ,తుము చౌదరి ,ఆళ్లమురళి, కోనేరు సత్యనారాయణ, మైనారిటీ నాయకుడు గౌస్ పాషా చీకటి కార్తీక్, పాల సత్యనారాయణ రెడ్డి, అంతోటి పాల్, కనకరాజు, వెంకటేష్ పంచాయతీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





