- చిరుధాన్యాలతో ప్రసాదాల విక్రయాన్నీ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం
యాదాద్రి,ప్రజాతంత్ర, జూన్ 21 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలోల భాగంగా యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం బంగారం, వెండి నాణెల(డాలర్) విక్రయాల..వెబ్ పోర్టల్, ఆన్లైన్ టికెట్ సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు స్వామివారి దర్శనానికి వొచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభువు శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని..స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం బంగారు నాణెంను ఈవో గీత.. వెండి నాణెంను ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి..చిరుధాన్యాల లడ్డూను దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి కొనుగోలు చేయగా వారికి మంత్రి అందజేశారు.
బంగారు డాలర్ 3 గ్రాముల ధర రూ.21,000 లుగా నిర్ణయించగా..వెండి 5 గ్రాములు రూ.1,000, మిల్లెట్ ప్రసాదం 80 గ్రాములు రూ. 40 లుగా దేవస్థానం నిర్ణయించింది. అనంతరం ఏర్యాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతకు ముందు రాయగిరిలో రూ.12కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేద పాఠశాలకు మంత్రులు భూమిపూజ చేశారు. అన్నదాన సత్రాన్ని, ప్రెసిడెన్షియల్ సూట్ సవి•పంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రులు ప్రారంభించారు.




