యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్‌ సరఫరాకు రవాణా వ్యవస్థ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటేరియల్‌ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక పాలసీ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఉన్న రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్‌ అప్‌ చేశారు. దీంతో యాదాద్రి ప్లాంట్‌ పవర్‌ జనరేషన్‌లో చారిత్రక ఘట్టం మొదలైంది. దశల వారీగా పవర్‌ జనరేషన్‌ చేపట్టి త్వరలో గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇటీవలే యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది. దీంతో జెన్‌ కో విద్యుత్‌ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఈ రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్‌ అప్‌ చేశారు. ఆ తర్వాత రెండో విడతలో మరో 800 మెగావాట్ల మూడు యూనిట్లతో 2,400 మెగా వాట్లు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంగా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి 4,000 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటైంది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైటీపీఎస్‌ పనుల పురోగతిని పరిశీలించిన విషయం తెలిసిందే. వైటీపీఎస్‌లో ముగ్గురు మంత్రులు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సవ్నిక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ప్లాంట్‌లో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉంది..బొగ్గు తరలించే రైల్వే ట్రాక్‌ నిర్మాణ పురోగతి, గతంలో జరిగిన పనుల బిల్లుల చెల్లింపులు, రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై మంత్రులు సవ్నిక్షించారు. ఇంకా ఎంత మందికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది.. తదితర అంశాలతో ప్రపంచం మొత్తం హరిత విద్యుత్‌, పునరుత్పాదక ఇంధనం వైపు దూసుకుపోతుంటే గత పాలకులు థర్మల్‌ పవర్‌ పై దఅష్టి సారించారు. వివిధ కారణాలతో జాప్యం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిరదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్లాంట్‌లో నైపుణ్యం, నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *