మోదీ తూటకి వరికంకులు నేలరాలేను ….!!

మట్టి మనుషుల్ని
వాళ్ళ బతుకు తీపుల్నీ
మార్కెట్‌ సరుకు చేశావ్‌
ఇప్పుడు నీలో పారేది అమెరికన్‌ రక్తం !
దిల్లీ హర్యానా సరిహద్దు
ఒక రణస్థలి
మరణం వున: వున:
జన్మిస్తుందా ?
లేదు. మరణం జన్మగా
పరివర్తన చెందుతుంది
అన్నదాత వీపుమీద
పడుతున్న రబ్బరు
లారీల వర్ష మోత..
లెక్క పెట్టడం కష్టం
లాఠీలు దెబ్బల్నీ !
లోలోపల స్రవిస్తున్న
కలల విచ్చేదాల్ని
వరికంకుల క్షుద్రక్రిడల్నీ
ముళ్ళతీగ పక్క
పడిపోయిన రైతులను
ఆ పక్కనే తుపాకీ గుండు
మింగిన మోదీని అడుగు
నిర్థాక్షిణ్యంగా గుర్రాల్‌
తొక్కన వరికాంకులను
భారత ప్రజలను అడుగు
రక్త సిక్తమయిన దిల్లీ
హర్యానా సరిహద్దు !
ఇక నీ శయనాగారం
బహుశా రేపునీకది
శవపేటిక ద్వారం తెరుస్తుంది
నేలచిందిన నెత్తుట్లో
నాకు రేపు కనబడుతుంది
జరగబోయే యుద్ధాలే కాదు
నీతోపాటు పతనమయ్యే
సామ్రాజ్యవాదులూ
అన్నదాత పై దాడులు
అధికార పతనాలూ
అన్నీ కనపడతాయి .. !
పదియేళ్ళు పరిపాలిస్తావా  వెర్రపీనుగా?
మా రక్తాన్ని తాగుతున్న
ముఖేష్‌ అంబానీ అనిల్‌ అంబానీ !
మట్టి నుంచి మొలిచిన చేతులన్నీ
హర్యానా రక్తరణస్థలిలో
విజయఫలకాలుగా
శిరసెత్తుతాయి..!
ఎక్కుడ్నుంచి వచ్చావ్‌
ఏనాడో మరిచావు…!!
  -శోభరమేష్‌
8978656327
(దిల్ల్లీ హర్యానా సరిహద్దుల్లో పోలీస్‌ కాల్పుల్లో మరణించిన అన్నదాతను సందిస్తూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *