మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు

కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం
సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు
కెసిఆర్‌ అహంకారానికి పరాకాష్ట
మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘునందర్‌ ‌రావు
బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ 6,12,13 ‌వ తేదీల్లో మాత్రమే సమావేశాలు అని నోటీసులు పంపారని చెప్పారు. చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సమావేశాలు జరగలేదన్నారు. బీఏసీని సంప్రదించ కుండా సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ అహంకారనికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. స్పీకర్‌ ఒక మర మనిషి లాగా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. సీఎం చెప్పింది చేయడం తప్ప..స్పీకర్‌ ‌పోచానికి వేరే పని లేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మేల్యే న్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారు. కానీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతుందన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నయంటే తమ సమస్యలు ప్రస్తావించమని పలురంగాల వారు విన్నవించుకునే పద్ధతి ఉండేదని ఈటల పేర్కొన్నారు. ఈ క్రమంలో శాసన సభ్యులను గడ్డి పోచల్లాగా అవమానిస్తున్నారని ఆరోపించారు. సమావేశాలు రెండు, మూడు రోజులకే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ‌ప్రసంగం లేకపోవడంపై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్‌ ‌చేశారన్నారు. ఈ సమావేశాల్లో పోడు భూములు, దళిత బంధు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు.

ప్రజల పక్షాన బీజేపీ ఉంటుందని ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్‌ ‌పార్క్ ‌వద్ద అమరవీరుల స్థూపానికి, అసెంబ్లీ వద్ద సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌విగ్రహనికి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, ‌రఘునందన్‌ ‌రావు నివాళులు అర్పించారు. తెలంగాణ గడ్డవి•ద ఎవరూ సంతోషంగా లేరని ఈటల రాజేందర్‌ అన్నారు. చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ తమకు వినతులు వొస్తున్నాయని చెప్పారు. విఆర్‌ఏ, ‌గ్రామ కార్యదర్శులు, గెస్ట్ ‌లెక్చరర్లు ఆత్మహత్యలకు పాల్పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చిన తరువాత సెప్టెంబర్‌ 17‌ను మరిచిపోయారన్నారు. అమిత్‌ ‌షా స్వయంగా సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా జరిపి అండగా ఉంటామని చెప్పారన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వొచ్చిందని చురకలంటించారు. సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ భారత దేశంలో విలినమైన రోజ అని ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు అన్నారు. ఆపరేషన్‌ ‌పోలో ద్వారా సర్దార్‌ ‌వల్లబ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌నిజాం నవాబుకు వ్యతిరేకంగా భారత్‌లో విలీనం చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 17 ‌విలీన దినోత్సవం జరపాలని చాలా సంవత్సరాలుగా బీజేపీ పోరాడుతుందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు టీఆరెస్‌ ‌కూడా అధికారికంగా జరపాలని చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 17 ‌ను అధికారికంగా నిర్వహిస్తామని..పెరేడ్‌ ‌గ్రౌండ్‌లో కవాతు ఉంటుందన్నారు.

బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం
బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్‌ ‌పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు మండిపడ్డారు. రాజాసింగ్‌ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని, ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని, అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్‌ ‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నాయని ఫైర్‌ అయ్యారు. గతంలో కూడా ఇదే విషయమై స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డిని కలిసి వివరించామని, అయినా తమని బీఏసీ సమావేశానికి పిలవలేదని తెలిపారు. సీఎం కెసిఆర్‌ ‌చెప్పినట్లుగా స్పికర్‌ ‌నడుచుకుంటున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *