రోహిణి కార్తె ఎండలు
మేఘాలను ధహించి వేస్తాయి
మృగశిర కార్తె మండిన మేఘాలను
మచ్చిక చేసుకొని మధించి
తొలకరి చినుకులు కురిపిస్తుంది

ఎండలకు ఎండి బీళ్ళు వారి
నోళ్ళు తెరిచిన మాగానులకు
అవి అమృతం జల్లులే
దుక్కి దున్నే రైతన్న బసవన్నలను
పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు
ఏరువాక సాగించి
యెయి పుట్లు పండిరచి
యెల్లరి ఆకలి తీర్చుతాడు
ఏరు ముందైతే ఏరువాక విందే!
రోహిణి ఎండలు ఋతు పవనాలకు
రహదారులు నిర్మిస్తాయి
మృగశిర అంటే మిర్గం పండుగ
మృగశిర నాడు ఇంగువ బెల్లం తింటే
చలి కాలం లో ఇగం బెట్టదంట
మిర్గం భూనిందంటే కాలం చల్లబడినట్లే
తొలకరి కురుస్తే ధరణి హర్షిస్తుంది
– పి.బక్కారెడ్డి
 9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *